Telugu Global
Cinema & Entertainment

యాక్టింగ్ పై కాదట.... బిజినెస్ పై ఆసక్తట..!

గత కొంత కాలంగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బోలెడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. నందమూరి అభిమానులు అందరూ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ను హీరోగా చూడాలని ఎదురుచూస్తూ ఉండగా… బాలకృష్ణ మాత్రం తన కొడుకు లాంచ్ గురించి నోరు విప్పడం లేదు. అయితే బాలకృష్ణ ….మోక్షజ్ఞని యాక్టింగ్ క్లాస్సెస్ కోసం న్యూయార్క్ ఫిలిం అకాడమీ కి పంపించారు అని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నందమూరి అభిమానులకు ఒక పెద్ద షాక్ తగిలింది. […]

యాక్టింగ్ పై కాదట.... బిజినెస్ పై ఆసక్తట..!
X

గత కొంత కాలంగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బోలెడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. నందమూరి అభిమానులు అందరూ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ను హీరోగా చూడాలని ఎదురుచూస్తూ ఉండగా… బాలకృష్ణ మాత్రం తన కొడుకు లాంచ్ గురించి నోరు విప్పడం లేదు.

అయితే బాలకృష్ణ ….మోక్షజ్ఞని యాక్టింగ్ క్లాస్సెస్ కోసం న్యూయార్క్ ఫిలిం అకాడమీ కి పంపించారు అని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నందమూరి అభిమానులకు ఒక పెద్ద షాక్ తగిలింది.

నందమూరి మోక్షజ్ఞ కు అసలు సినిమాలపై ఆసక్తి లేదని తెలుస్తోంది. హీరోగా సినిమాలలో నటించడం కంటే ఏదైనా ఒక బిజినెస్ మొదలు పెట్టడం బెటర్ అని మోక్షజ్ఞ అనుకుంటున్నట్లు సమాచారం. కానీ బాలకృష్ణ మాత్రం తన కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాడట.

మోక్షజ్ఞ మాత్రం అసలు ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చూడాలని కూడా అనుకోవడం లేదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

First Published:  1 Jun 2019 11:37 PM GMT
Next Story