Telugu Global
Cinema & Entertainment

కోడలు తక్కువ డిమాండ్ చేస్తే.... మామ ఎక్కువ ఇప్పించాడట..!

సమంత… అక్కినేని కోడలు గా మారిన దగ్గర నుంచి నాగార్జున ఆమె పై ఎనలేని ప్రేమని కురిపిస్తున్నాడు. కొంత మంది చెప్పే దాని బట్టి చూస్తే నాగార్జున ఒక్కోసారి ఫ్యామిలీ లో నాగ చైతన్య కన్నా సమంత కె ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడట. ఏదైనా డెసిషన్స్ విషయం లో కూడా చైతన్య కన్నా సమంత నే ఎక్కువ గా అప్రోచ్ అవుతూ ఉంటాడట. ఈ విషయం లో మాత్రం నాగార్జున ఏ మాత్రం రాజీ పడడట. అయితే […]

కోడలు తక్కువ డిమాండ్ చేస్తే.... మామ ఎక్కువ ఇప్పించాడట..!
X

సమంత… అక్కినేని కోడలు గా మారిన దగ్గర నుంచి నాగార్జున ఆమె పై ఎనలేని ప్రేమని కురిపిస్తున్నాడు. కొంత మంది చెప్పే దాని బట్టి చూస్తే నాగార్జున ఒక్కోసారి ఫ్యామిలీ లో నాగ చైతన్య కన్నా సమంత కె ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడట.

ఏదైనా డెసిషన్స్ విషయం లో కూడా చైతన్య కన్నా సమంత నే ఎక్కువ గా అప్రోచ్ అవుతూ ఉంటాడట. ఈ విషయం లో మాత్రం నాగార్జున ఏ మాత్రం రాజీ పడడట.

అయితే రాజు గారి గది 2 సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మన్మధుడు 2 లో నటించారు. ఈ సినిమా కి నిర్మాత జెమినీ కిరణ్ మరియు నాగార్జున. అయితే ఈ సినిమా లో సమంత ది చాలా చిన్న పాత్ర. పైగా దర్శకుడు రాహుల్, సమంత కి ఎప్పుడూ డబ్బింగ్ చెప్పే చిన్మయి భర్త. ఈ ఫ్రెండ్ షిప్ కి గౌరవం ఇస్తూ ఈ చిన్న పాత్ర ని చేయడానికి సమంత ఈ సినిమా ఒప్పుకుంది అని టాక్.

అయితే సినిమా షూట్ అనంతరం సమంత రెమ్యూనరేషన్ చాలా తక్కువ డిమాండ్ చేసిందట. కానీ నాగార్జున మాత్రం పట్టు పట్టి సమంతని బలవంతం పెట్టి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనేలా చేసాడట.

First Published:  2 Jun 2019 1:46 AM GMT
Next Story