Telugu Global
NEWS

బాబు కోసం జగన్ ‘అమేథి’ ఫార్ములా....

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ఫలితాల తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాను ఇక ఆ సీట్లో కూర్చోనని మొండికేస్తూ కాంగ్రెస్ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మూడు హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను గెలిపించిన రాహుల్…. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తన సొంత నియోజకవర్గం ‘అమేథి’లో ఓడిపోయారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కు తాను అధ్యక్షుడిగా అనర్హుడినంటూ తప్పుకుంటున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా…. బీజేపీ అదే చేసింది. 2014లో అమేథిలో […]

బాబు కోసం జగన్ ‘అమేథి’ ఫార్ములా....
X

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ఫలితాల తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాను ఇక ఆ సీట్లో కూర్చోనని మొండికేస్తూ కాంగ్రెస్ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

మూడు హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను గెలిపించిన రాహుల్…. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తన సొంత నియోజకవర్గం ‘అమేథి’లో ఓడిపోయారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కు తాను అధ్యక్షుడిగా అనర్హుడినంటూ తప్పుకుంటున్నాడు.

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా…. బీజేపీ అదే చేసింది. 2014లో అమేథిలో రాహుల్ చేతిలో ఓడిపోయారు బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ…. అనంతరం కేంద్రమంత్రి అయ్యారు. అప్పటినుంచి అమేథిపై స్మృతీ, బీజేపీ ఫోకస్ పెట్టింది. గడిచిన 5 ఏళ్లలోనే రాహుల్ కు కూడా సాధ్యంకాని రీతిలో అభివృద్ధి చేసింది. మౌలిక వసతులు కల్పించింది. సంక్షేమ పథకాలను అందించింది. స్మృతీ దగ్గరుండి ఈ పనులన్నింటిని చేశారు. ప్రజలకు కష్టమొస్తే పరిష్కరించేలా ఒక వేదిక ఏర్పాటు చేశారు.

దీంతో స్మృతీ ఇరానీని అమేథి ప్రజలు నమ్మారు. తమ కష్టాలు తీరాలంటే స్మృతీ ఇరానీనే గెలిపించాలని డిసైడ్అయ్యారు. కాంగ్రెస్ కు కంచుకోటైన అమేథిలో ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడినే ఓడించారు.

ఇలా అమేథి ఫార్ములాను జగన్ ఇప్పుడు కుప్పంపై ప్రయోగించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మొన్నటి వైసీపీ గాలిలో అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో సైతం చంద్రబాబు మొదటి రౌండ్ లో వెనుకబడి అనంతరం తక్కువగా 30వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారు.

అందుకే ఈ ఐదేళ్లలో ఓడిన వైసీపీ అభ్యర్థి చేతుల మీదుగా కుప్పంను అభివృద్ధి బాట పట్టించాలని…. ఏ పని అయినా వైసీపీ అభ్యర్థి చేసేలా తయారు చేయాలని…. అలా వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబును కుప్పంలోనే ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలిసింది.

ఈ మేరకు కుప్పం అభివృద్ధిపై పంచాయతీ అధికారులను నివేదిక కోరగా.. వారంలోపు సిద్ధం చేసి ఇస్తామని తెలిపారట. మరో వారంలోనే దాన్ని జగన్ కు ఇస్తే ఆ మేరకు కుప్పంను అభివృద్ధి చేసి బాబును ఓడించే స్కెచ్ గీశారట.

First Published:  3 Jun 2019 4:14 AM GMT
Next Story