Telugu Global
NEWS

ఫ్రెంచ్ క్వార్టర్స్ లో 12వసారి ఫెదరర్

రోలాండ్ గారోస్ లో నడాల్ 90వ విజయం గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ తన కెరియర్ లో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురిపెట్టాడు. 2019 ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్ చేరడం ద్వారా.. 37 ఏళ్ల వయసులోనూ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటిచెప్పాడు. మరోవైపు ఫ్రెంచ్ కింగ్ రాఫెల్ నడాల్ సైతం…తన 12వ ఫ్రెంచ్ టైటిల్ వేటలో క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు. పారిస్ లోని న్యూలుక్ రోలాండ్ గారోస్ స్టేడియం సెంటర్ కోర్టులో జరిగిన […]

ఫ్రెంచ్ క్వార్టర్స్ లో 12వసారి ఫెదరర్
X
  • రోలాండ్ గారోస్ లో నడాల్ 90వ విజయం

గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ తన కెరియర్ లో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురిపెట్టాడు. 2019 ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్ చేరడం ద్వారా.. 37 ఏళ్ల వయసులోనూ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటిచెప్పాడు.

మరోవైపు ఫ్రెంచ్ కింగ్ రాఫెల్ నడాల్ సైతం…తన 12వ ఫ్రెంచ్ టైటిల్ వేటలో క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు.

పారిస్ లోని న్యూలుక్ రోలాండ్ గారోస్ స్టేడియం సెంటర్ కోర్టులో జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ పోటీలో…మాజీ చాంపియన్, 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత రోజర్ ఫెదరర్ వరుస సెట్లలో అర్జెంటీనా ఆటగాడు లియోనార్డోను చిత్తు చేశాడు.

2015 తర్వాత తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగిన ఫెదరర్..నాలుగోరౌండ్ పోటీలో గంటా 42 నిముషాల పోరులో లియోనార్డో మేయర్ ను 6-2, 6-3, 6-3తో ఓడించాడు.

2009లో ఫ్రెంచ్ టైటిల్ నెగ్గిన ఫెదరర్…క్వార్టర్స్ చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. క్వార్టర్స్ వరకూ రాగలనని తాను అనుకోలేదని.. ప్రస్తుత ఈ టోర్నీలో ప్రతివిజయమూ తనకు బోనస్ లాంటిదేనని తెలిపాడు. ఫెదరర్ కెరియర్ లో ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం ఇది 12వసారి. అంతేకాదు 37 ఏళ్ల లేటు వయసులో ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ చేరిన రెండో ఆటగాడిగా కూడా రికార్డుల్లో చోటు సంపాదించాడు.

స్పానిష్ బుల్ టాప్ గేర్…

క్లేకోర్టు టెన్నిస్ మొనగాడు, 11సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్, 2వ సీడ్ రాఫెల్ నడాల్ సైతం క్వార్టర్స్ కు అలవోకగా చేరుకొన్నాడు.
ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు యువాన్ ఇగ్నేషియోను 6-2, 6-3, 6-3తో చిత్తు చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్ చేరడం నడాల్ కు ఇది 13వసారి.

32 ఏళ్ల నడాల్ కెరియర్ లో గ్రాండ్ స్లామ్ సింగిల్స్ క్వార్టర్స్ చేరడం ఇది 38వసారి. సెమీఫైనల్లో చోటు కోసం జరిగే పోటీలో..
నిషికోరితో నడాల్ తలపడాల్సి ఉంది. నిషికోరీ ప్రత్యర్థిగా నడాల్ కు 10 విజయాలు, 2 పరాజయాల రికార్డు ఉంది.

First Published:  2 Jun 2019 10:50 PM GMT
Next Story