Telugu Global
Cinema & Entertainment

అన్నింటికీ ఇక మెహరీన్ అమ్మేనట....!

ఒకప్పుడు వరుస డిజాస్టర్ లతో సతమతమైన పంజాబీ బ్యూటీ మెహరీన్ పిర్జాదా కౌర్ ఎట్టకేలకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2’ సినిమా తో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఇక ఈ సినిమాతో తన స్పీడ్ పెంచి మరిన్ని సినిమాలు చేయాల్సిన ఈ సమయంలో తన మేనేజర్ ని తప్పించి ఆ స్థానంలో వాళ్ళ అమ్మ సహాయం తీసుకుంటోంది భామ. అమ్మకూచి అయిన మెహరీన్… ఇప్పుడు తన కెరియర్ […]

అన్నింటికీ ఇక మెహరీన్ అమ్మేనట....!
X

ఒకప్పుడు వరుస డిజాస్టర్ లతో సతమతమైన పంజాబీ బ్యూటీ మెహరీన్ పిర్జాదా కౌర్ ఎట్టకేలకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2’ సినిమా తో బ్లాక్ బస్టర్ ను అందుకుంది.

ఇక ఈ సినిమాతో తన స్పీడ్ పెంచి మరిన్ని సినిమాలు చేయాల్సిన ఈ సమయంలో తన మేనేజర్ ని తప్పించి ఆ స్థానంలో వాళ్ళ అమ్మ సహాయం తీసుకుంటోంది భామ. అమ్మకూచి అయిన మెహరీన్… ఇప్పుడు తన కెరియర్ కు సంబంధించిన ప్రతి విషయంలోనూ వాళ్ళ అమ్మగారి జోక్యం ఉండేలా చూసుకుంటోందట.

అంటే ఇప్పటి నుంచి కథలు వినాలన్నా, డేట్లు సర్దుబాటు చేయాలన్నా, పారితోషికం గురించి మాట్లాడాలన్నా అన్ని దగ్గరుండి మెహరీన్ వాళ్ళ అమ్మ చూసుకోనున్నారట. అంతేకాకుండా సెట్లో ఎలాంటి ఆహారం ఇవ్వాలి అని కూడా ఆమె డిసైడ్ చేయబోతున్నారు అన్నమాట.

ప్ర‌స్తుతం నాగ‌శౌర్య‌తో ఓ సినిమా చేస్తోంది మెహ‌రీన్‌. ఆ సినిమా కోసం దాదాపు 80 ల‌క్ష‌ల పారితోషికం కూడా తీసుకుందని వార్తలొస్తున్నాయి. మెహ‌రీన్‌ ఇప్ప‌టి వ‌ర‌కూ తీసుకున్న హైయెస్ట్ పారితోషికం ఇదే. నిర్మాత ద‌గ్గ‌ర 80 ల‌క్ష‌లకు ఒప్పించిన ఘనత కూడా మెహరీన్ అమ్మదే అని సమాచారం.

First Published:  3 Jun 2019 5:02 AM GMT
Next Story