నాగశౌర్య నుంచి మరో ఇంట్రెస్టింగ్ టైటిల్

ఇప్పటికే నర్తనశాల అనే టైటిల్ తో సినిమా చేశాడు నాగశౌర్య. ఆ సినిమా ఫ్లాప్ అయినా టైటిల్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. అందర్నీ ఆకర్షించింది కూడా. ఇప్పుడు అదే కోవలో తన అప్ కమింగ్ సినిమాకు అశ్వద్ధామ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నాడు ఈ హీరో. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇదే టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

తన సొంత బ్యానర్ పై రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. మెహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్. గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఈ సినిమా కథను నాగశౌర్య స్వయంగా తనే రాసుకున్నాడు. అలా అన్నీ తానై సినిమా చేస్తున్న ఈ హీరో, ఈ ప్రాజెక్టుకు అశ్వద్ధామ అనే పేరు పెట్టాలని అనుకుంటున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. మరో 4 రోజుల్లో సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. నాగశౌర్య తల్లి ఈ సినిమాకు నిర్మాత, తండ్రి సమర్పకుడు, కొడుకు హీరో.