Telugu Global
Cinema & Entertainment

ఎన్ని సినిమాలు ప్రకటిస్తావ్ నితిన్?

ఇప్పటివరకు 3 సినిమాలు ఎనౌన్స్ చేశాడు నితిన్. తనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటన-1, ప్రకటన-2, ప్రకటన-3 అంటూ 3 సినిమాల వివరాల్ని వెల్లడించాడు. వీటిలో ఒక్క సినిమా కూడా ఇంకా సెట్స్ పైకి రాలేదు. అంతలోనే మరో సినిమా ఎనౌన్స్ చేశాడు ఈ హీరో. అవును.. తను చేయబోయే నాలుగో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ హీరో. తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాల్ని తీసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ […]

ఎన్ని సినిమాలు ప్రకటిస్తావ్ నితిన్?
X

ఇప్పటివరకు 3 సినిమాలు ఎనౌన్స్ చేశాడు నితిన్. తనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటన-1, ప్రకటన-2, ప్రకటన-3 అంటూ 3 సినిమాల వివరాల్ని వెల్లడించాడు. వీటిలో ఒక్క సినిమా కూడా ఇంకా సెట్స్ పైకి రాలేదు. అంతలోనే మరో సినిమా ఎనౌన్స్ చేశాడు ఈ హీరో. అవును.. తను చేయబోయే నాలుగో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ హీరో.

తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాల్ని తీసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడు. వీళ్లిద్దరి మధ్య తాజాగా కథాచర్చలు ముగిశాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం ఇదే బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాకు కమిట్ అయ్యాడు నితిన్.

ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విశేషం ఏంటంటే.. వెంకీ అట్లూరి-నితిన్ సినిమాకు హీరోయిన్ కూడా ఫిక్స్ అయిందట. ఈ సినిమాలో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. మూవీలో హీరోయిన్ పాత్రకు మంచి వెయిట్ ఉంటుందట. అందుకే కథ విన్న వెంటనే కీర్తిసురేష్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి ఓ ప్రకటన రానుంది.

First Published:  3 Jun 2019 11:18 AM GMT
Next Story