Telugu Global
NEWS

ప్రపంచకప్ లో మహిళా కామెంటీటర్ల జోరు

24 మంది వ్యాఖ్యాతల జట్టులో ముగ్గురు మహిళలు పురుషులకు దీటుగా క్రికెట్ మహిళా వ్యాఖ్యాతలు ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా… జరుగుతున్న 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ ప్రత్యక్ష ప్రసారకార్యక్రమాలలో.. ముగ్గురు మహిళా కామెంటీటర్లు అదరగొడుతున్నారు. తమకు తగిన ప్రోత్సాహం ఇస్తే…పురుషులకు ఏమాత్రం తీసిపోమని చాటుకొంటున్నారు. ముగ్గురూ ముగ్గురే.. ఇంగ్లండ్ వేదికగా ప్రారంభమైన వన్డే పురుషుల ప్రపంచకప్ టోర్నీలో…ముగ్గురు మహిళా కామెంటీటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జులై 14 వరకూ…11 వేదికల్లో 46 రోజులపాటు 48 మ్యాచ్ […]

ప్రపంచకప్ లో మహిళా కామెంటీటర్ల జోరు
X
  • 24 మంది వ్యాఖ్యాతల జట్టులో ముగ్గురు మహిళలు
  • పురుషులకు దీటుగా క్రికెట్ మహిళా వ్యాఖ్యాతలు

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా… జరుగుతున్న 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ ప్రత్యక్ష ప్రసారకార్యక్రమాలలో.. ముగ్గురు మహిళా కామెంటీటర్లు అదరగొడుతున్నారు. తమకు తగిన ప్రోత్సాహం ఇస్తే…పురుషులకు ఏమాత్రం తీసిపోమని చాటుకొంటున్నారు.

ముగ్గురూ ముగ్గురే..

ఇంగ్లండ్ వేదికగా ప్రారంభమైన వన్డే పురుషుల ప్రపంచకప్ టోర్నీలో…ముగ్గురు మహిళా కామెంటీటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

జులై 14 వరకూ…11 వేదికల్లో 46 రోజులపాటు 48 మ్యాచ్ లుగా సాగే ఈ టోర్నీ కోసం…మొత్తం 10 దేశాలకు చెందిన 24 మంది కామెంటీటర్ల జట్టును స్టార్ నెట్ వర్క్ ఇంతుకు ముందే ఎంపిక చేసి…క్రికెట్ కామెంట్రీ బరిలో నిలిపింది.

మొత్తం 24 మంది ప్రపంచకప్ కామెంటీటర్ల బృందంలో పురుషులే 21 మంది ఉన్నారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, సంజయ్ మంజ్రేకర్, హర్షా బోగ్లే తో పాటు… ఇతర ప్రముఖ వ్యాఖ్యాతలలో…మైకేల్ క్లార్క్, మైకేల్ స్లేటర్, వసీం అక్రం, రమీజ్ రాజా, కుమార సంగక్కర, పామీ ఎంబాగ్వా, అతర్ అలీ ఖాన్, మైకేల్ హోల్డింగ్, ఇయాన్ బిషప్, మైకేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్, ఇయాన్ వార్డ్, సైమన్ డూల్, ఇయాన్ స్మిత్, బ్రెండన్ మెకల్లమ్, గ్రీమ్ స్మిత్ ,షాన్ పోలాక్ ఉన్నారు.

అయితే…మహిళా కామెంటీటర్లుగా మాత్రం ముగ్గురు మహిళా మాజీ క్రికెటర్లకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్, భారత సంతతికి చెందిన ఇషా గుహ, మెల్ జోన్స్, అలీసన్ మిషెల్ కామెంటీటర్లుగా తమ సత్తా చాటుకొంటు..ఔరా అనిపిస్తున్నారు.

First Published:  3 Jun 2019 4:04 AM GMT
Next Story