ఈ వీకెండ్ రోజుకో సినిమా

సాధారణంగా శుక్రవారం వస్తే సినిమాల సందడి ఉంటుంది. ఒకే రోజు 3-4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ వీకెండ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్. అదేంటంటే.. రోజుకో సినిమా రిలీజ్ అవుతోంది. అవును.. బుధవారం ఒకటి, గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి.. ఇలా ఒక్కో రోజును ఒక్కో సినిమా పంచుకున్నాయి.

రంజాన్ సందర్భంగా బుధవారం రోజున సెవెన్ అనే సినిమా వస్తోంది. హవీష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. మెయిన్ హీరోయిన్ మాత్రం రెజీనా. ఈ సినిమాపై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రయిలర్ కూడా హిట్ అవ్వడంతో వాళ్ల నమ్మకం మరింత పెరిగింది. ఎక్కడా సినిమా స్టోరీలైన్ బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. దీనికితోడు సినిమాలో లిప్ కిస్సులు అదనం.

సెవెన్ విడుదలైన 24 గంటల్లోనే హిప్పీ వస్తోంది. ఆర్ఎక్స్100 లాంటి సూపర్ హిట్ తర్వాత కార్తికేయ నుంచి వస్తున్న సినిమా ఇదే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. కార్తికేయ లుక్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ ట్రయిలర్ కూడా బాగానే క్లిక్ అయింది. దిగాంగన, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు

ఇక సెవెన్, హిప్పీ సినిమాలకు పోటీగా విజయ్ ఆంటోనీ నటించిన కిల్లర్ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఇందులో కేవలం విజయ్ ఆంటోనీ మాత్రమే లేడు. సీనియర్ యాక్టర్, యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఉన్నాడు. వీళ్లిద్దరి ఎపిసోడ్స్ టోటల్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు మేకర్స్. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమా కచ్చితంగా తనకు టాలీవుడ్ లో మంచి పేరు తీసుకొస్తుందంటున్నాడు విజయ్ ఆంటోనీ. ఇలా ఈ వీకెండ్ రోజుకో సినిమా విడతల వారీగా థియేటర్లలోకి రానున్నాయి.