Telugu Global
NEWS

చీఫ్ జస్టిస్ తో జగన్.... అక్రమార్కులలో ఆందోళన....

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ వేగంగా ముందుకెళ్తున్నారు. వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనను ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటికే సీఎంవో అధికారులను మార్చేశారు. కొత్త డీజీపీని నియమించి టీడీపీకి అనుకూలమైన వారిని కీలక స్థానాల్లో నుంచి తొలగించారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వరుసబెట్టి సమీక్షలు చేస్తూ అందులోని అక్రమాల గుట్టు విప్పుతున్నారు. ఇక చంద్రబాబు హయాంలో కాంట్రాక్టులు పొంది భారీగా వెనకేసుకున్న అక్రమాలపై లెక్క తేలుస్తున్నారు. ఎక్కువ మింగేసిన వాటిని వెనక్కితీసుకోవాలని.. కాంట్రాక్టర్లకు […]

చీఫ్ జస్టిస్ తో జగన్.... అక్రమార్కులలో ఆందోళన....
X

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ వేగంగా ముందుకెళ్తున్నారు. వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనను ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటికే సీఎంవో అధికారులను మార్చేశారు. కొత్త డీజీపీని నియమించి టీడీపీకి అనుకూలమైన వారిని కీలక స్థానాల్లో నుంచి తొలగించారు.

ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వరుసబెట్టి సమీక్షలు చేస్తూ అందులోని అక్రమాల గుట్టు విప్పుతున్నారు. ఇక చంద్రబాబు హయాంలో కాంట్రాక్టులు పొంది భారీగా వెనకేసుకున్న అక్రమాలపై లెక్క తేలుస్తున్నారు. ఎక్కువ మింగేసిన వాటిని వెనక్కితీసుకోవాలని.. కాంట్రాక్టర్లకు బిల్లులన్నీ ఆపివేయాలని జగన్ ఆదేశాలిచ్చారు..

మొత్తంగా జగన్ ప్రస్తుతం అక్రమార్కుల వాసనలు పోవాలనే కృతనిశ్చయంతో ఈ నిర్ణయాలను తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి సీఎం హోదాలో ఏపీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ తో జగన్ భేటి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈరోజు సాయంత్రం జగన్ 5.30 గంటలకు చీఫ్ జస్టిస్ తో భేటీ కానున్నారు..

ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించినట్టు ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులన్నీ జ్యూడిషియల్ కమిషన్ చేతుల మీదుగా జరిపేందుకు వెంటనే సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసి జ్యూడిషియల్ కమిషన్ ను నియమించాలని జగన్ కోరనున్నట్టు తెలిసింది.

ఇక దాంతోపాటు చంద్రబాబు ప్రభుత్వంలో చోటుచేసుకున్న అక్రమాలు, ప్రాజెక్టులు, భూ కేటాయింపులపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణను కోరనున్నట్టు సమాచారం. దీంతో చంద్రబాబుకు, టీడీపీ నేతలకు చిక్కులు ఖాయమని వారంతా ఆందోళనగా ఉన్నట్టు సమాచారం.

First Published:  4 Jun 2019 1:28 AM GMT
Next Story