సురేష్ బాబు వెనకడుగు…. గుణశేఖర్ ముందడుగు….

రానా దగ్గుబాటి ప్రధాన పాత్ర లో గుణశేఖర్ దర్శకత్వం లో ప్రతాపరుద్రుడు అనే సినిమా వస్తుందని ప్రచారం జరిగింది…. కానీ గుణశేఖర్ తన వ్యూహాలని మార్చి ఇప్పుడు హిరణ్యకశిప కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

 

రుద్రమదేవి లాంటి చిత్రం తర్వాతా మళ్ళీ అదే రేంజ్ లో పౌరాణిక సినిమాని చేయడం అంటే మామూలు విషయం కాదు. సుమారు గా మూడేళ్ళు ఈ సినిమా కి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు. కాగా ఇప్పుడు ఈ సినిమా కి దాదాపు గా 200 కోట్లు బడ్జెట్ అవుతుందని నిర్ధారించుకున్నాడు గుణశేఖర్‌. ముందు నుంచి ఈ సినిమా ని నిర్మిస్తానని చెప్పుకుంటూ వచ్చిన సురేష్ బాబు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాడని తెలుస్తోంది.

అయితే గుణశేఖర్…. సురేష్ బాబుతో పాటు బాలీవుడ్ నుండి ఫాక్స్ స్టార్ అనే సంస్థ ని కూడా ఈ సినిమా ని నిర్మించడానికి భాగస్వామి ని చేసాడట. అయితే అప్పటికీ సురేష్ బాబు విముఖత చూపుతూ ఉండటం తో….. ధైర్యం చేసి గుణశేఖర్ కూడా తాను కూడా భాగస్వామ్యమవుతానని మాట ఇచ్చాడట.

అయితే ఈ సినిమా ని తెలుగు లో నే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలనీ, వేరే భాషల నుండి అగ్ర నటుల్ని ఈ సినిమాకి తీసుకోవాలని గుణశేఖర్ భావిస్తున్నాడట. త్వరలో నే ఈ సినిమా షూటింగ్ గురించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.