Telugu Global
Cinema & Entertainment

ఉగాది 2020కి.... చిరంజీవి-కొరటాల సినిమా?

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సై రా నరసింహా రెడ్డి చిత్రం షూటింగ్ తో బిజీ ఉన్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే క్లారిటీ మాత్రం ఇంకా ఎవరికీ రాలేదు. కొంత మంది దసరా కి వస్తుంది అంటున్నారు… కానీ పూర్తి వివరాలు మాత్రం లేవు. అయితే సై రా పూర్తి కాగానే చిరంజీవి ఒక నెల రోజులు బ్రేక్ తీసుకుంటాడట. తర్వాత వెంటనే కొరటాల శివ తో చేయాల్సిన సినిమా షూటింగ్ […]

ఉగాది 2020కి.... చిరంజీవి-కొరటాల సినిమా?
X

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సై రా నరసింహా రెడ్డి చిత్రం షూటింగ్ తో బిజీ ఉన్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే క్లారిటీ మాత్రం ఇంకా ఎవరికీ రాలేదు.

కొంత మంది దసరా కి వస్తుంది అంటున్నారు… కానీ పూర్తి వివరాలు మాత్రం లేవు. అయితే సై రా పూర్తి కాగానే చిరంజీవి ఒక నెల రోజులు బ్రేక్ తీసుకుంటాడట. తర్వాత వెంటనే కొరటాల శివ తో చేయాల్సిన సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా టైటిల్ ను ఆగస్టు 22 న చిరంజీవి పుట్టిన రోజున అనౌన్స్ చేస్తారు అనే టాక్ నడుస్తుంది.

అయితే ఈ సినిమా ఒక సోషల్ డ్రామా గా తెరకెక్కనుంది. ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని, చిరంజీవి డబుల్ యాక్షన్ గా నటిస్తాడన్న టాక్ నడుస్తుంది.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి 2020 అంటే వచ్చే ఏడాది ఉగాది కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా ని రామ్ చరణ్ నిర్మించనున్నాడు.

First Published:  4 Jun 2019 1:56 AM GMT
Next Story