Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబుతో యాక్షన్ క్రైమ్ డ్రామా

అర్జున్ రెడ్డి హిట్ అయిన వెంటనే ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగను మహేష్ బాబు కలిసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కొన్ని రోజులకు మహేష్-సందీప్ మధ్య కథాచర్చలు కూడా జరిగాయి. ఆ తర్వాత అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కోసం బాలీవుడ్ కు వెళ్లిపోయాడు సందీప్ రెడ్డి. ఇప్పుడా సినిమా కూడా పూర్తవ్వడంతో మరోసారి మహేష్ తో అతడు చేయబోయే సినిమా టాపిక్ తెరపైకి వచ్చింది. కబీర్ సింగ్ సినిమా ప్రమోషన్ లో […]

మహేష్ బాబుతో యాక్షన్ క్రైమ్ డ్రామా
X

అర్జున్ రెడ్డి హిట్ అయిన వెంటనే ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగను మహేష్ బాబు కలిసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కొన్ని రోజులకు మహేష్-సందీప్ మధ్య కథాచర్చలు కూడా జరిగాయి. ఆ తర్వాత అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కోసం బాలీవుడ్ కు వెళ్లిపోయాడు సందీప్ రెడ్డి. ఇప్పుడా సినిమా కూడా పూర్తవ్వడంతో మరోసారి మహేష్ తో అతడు చేయబోయే సినిమా టాపిక్ తెరపైకి వచ్చింది.

కబీర్ సింగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మహేష్ తో చేయాల్సిన మూవీపై రియాక్ట్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. మహేష్ కు పైపైన ఓ స్టోరీ లైన్ చెప్పానని, కబీర్ సింగ్ పనులన్నీ పూర్తయిన తర్వాత మహేష్ మూవీపై వర్క్ చేస్తానని ప్రకటించాడు. అంతేకాదు, మహేష్ కు చెప్పిన కథ జానర్ కూడా బయటపెట్టాడు. యాక్షన్ క్రైమ్ జానర్ లో మహేష్ కు కథ చెప్పాడట సందీప్.

నిజానికి ఈ జానర్ లో మహేష్ సినిమా చేయలేదనే చెప్పాలి. అతడి సినిమాల్లో యాక్షన్ కామన్. ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కానీ క్రైమ్ సబ్జెక్ట్ ఎప్పుడూ హ్యాండిల్ చేయలేదు మహేష్. సో.. కథ, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటే కచ్చితంగా సందీప్ సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  4 Jun 2019 4:28 AM GMT
Next Story