Telugu Global
National

ప్రభుత్వ అధికారుల సమావేశంలో బ్లూ ఫిల్మ్‌ ప్రదర్శన

రాజస్థాన్‌ ప్రభుత్వ సచివాలయంలో ఆహార పౌర సరఫరాల శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆహార పౌర సరఫరాల శాఖ కార్యదర్శి ముగ్దాసింగ్‌ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆ శాఖ అధికారులందరూ పాల్గొన్నారు. ఈ మీటింగ్‌ సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన జిల్లా పౌర సరఫరా దారులు, స్థానిక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఎలా సేవలందించాలో డేటా క్లిప్పింగ్‌లతో రాష్ట్ర […]

ప్రభుత్వ అధికారుల సమావేశంలో బ్లూ ఫిల్మ్‌ ప్రదర్శన
X

రాజస్థాన్‌ ప్రభుత్వ సచివాలయంలో ఆహార పౌర సరఫరాల శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆహార పౌర సరఫరాల శాఖ కార్యదర్శి ముగ్దాసింగ్‌ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో ఆ శాఖ అధికారులందరూ పాల్గొన్నారు. ఈ మీటింగ్‌ సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన జిల్లా పౌర సరఫరా దారులు, స్థానిక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు.

ఈ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఎలా సేవలందించాలో డేటా క్లిప్పింగ్‌లతో రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు, రేషన్‌ డీలర్లకు వీడియో క్లిప్పింగుల సాయంతో విషయాన్ని బోధిస్తున్నారు. ఉన్నట్టుండి తెరమీద వీడియో క్లిప్పింగుల స్థానంలో బ్లూ ఫిల్మ్‌ ప్రసారం కావడం ప్రారంభమైంది.

దీంతో సమావేశాన్ని నిర్వహిస్తున్న రాష్ట్ర అధికారులతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌ను వీక్షిస్తున్న 33 జిల్లాల అధికారులు, రేషన్‌ డీలర్లు షాక్‌ కు గురయ్యారు.

ఇలా జరగడంపై ఆహార పౌర సరఫరాల శాఖ చీఫ్‌ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేసి, సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.

First Published:  4 Jun 2019 6:00 AM GMT
Next Story