Telugu Global
Cinema & Entertainment

వెంకీ మామ లేటెస్ట్ అప్ డేట్

రియల్ లైఫ్ మామఅల్లుళ్లు వెంకటేశ్-నాగచైతన్య కలిసి చేస్తున్న సినిమా ‘వెంకీ మామ’. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, చైతూ సరసన రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కశ్మీర్ లో షూటింగ్ జరుగుతోంది. కశ్మీర్ లో జరుగుతన్న షెడ్యూల్ ఈనెల 13 వరకు ఉంటుంది. సినిమాలో నాగచైతన్య మిలట్రీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అతడిపై కొన్ని యాక్షన్ […]

వెంకీ మామ లేటెస్ట్ అప్ డేట్
X

రియల్ లైఫ్ మామఅల్లుళ్లు వెంకటేశ్-నాగచైతన్య కలిసి చేస్తున్న సినిమా ‘వెంకీ మామ’. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, చైతూ సరసన రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కశ్మీర్ లో షూటింగ్ జరుగుతోంది.

కశ్మీర్ లో జరుగుతన్న షెడ్యూల్ ఈనెల 13 వరకు ఉంటుంది. సినిమాలో నాగచైతన్య మిలట్రీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అతడిపై కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసమే కశ్మీర్ వెళ్లారు. ఈ షెడ్యూల్ తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వదలుచుకోలేదు యూనిట్. హైదరాబాద్ లో వెంటనే మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు.

సినిమాకు సంబంధించిన కీలకమైన ఎపిసోడ్ కావడంతో, గ్యాప్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ కూడా ముగిసిన తర్వాత చిన్న గ్యాప్ ఇవ్వబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చేనెల నుంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రారంభించబోతున్నారు.

First Published:  4 Jun 2019 4:25 AM GMT
Next Story