Telugu Global
NEWS

ప్రపంచకప్ లో నేడు భారత్ తొలిసమరం

సౌతాంప్టన్ వేదికగా సౌతాఫ్రికాతో ఢీ భారత్ ప్రత్యర్థిగా సఫారీలదే పైచేయి పేస్ బౌలింగే ఆయుధంగా విరాట్ సేన రెడీ భారత క్రికెట్ అభిమానులంతా ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇంగ్లండ్ గడ్డపై ప్రపంచకప్ ప్రారంభమైన వారం రోజుల తర్వాత హాట్ ఫేవరెట్ భారత్ తన తొలిమ్యాచ్ కు సిద్ధమయ్యింది. సౌతాంప్టన్ వేదికగా జరిగే రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో సౌతాఫ్రికాతో విరాట్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. సఫారీలకు టెన్షన్ టెన్షన్ ప్రపంచకప్ మొదటి రెండురౌండ్ల […]

ప్రపంచకప్ లో నేడు భారత్ తొలిసమరం
X
  • సౌతాంప్టన్ వేదికగా సౌతాఫ్రికాతో ఢీ
  • భారత్ ప్రత్యర్థిగా సఫారీలదే పైచేయి
  • పేస్ బౌలింగే ఆయుధంగా విరాట్ సేన రెడీ

భారత క్రికెట్ అభిమానులంతా ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇంగ్లండ్ గడ్డపై ప్రపంచకప్ ప్రారంభమైన వారం రోజుల తర్వాత హాట్ ఫేవరెట్ భారత్ తన తొలిమ్యాచ్ కు సిద్ధమయ్యింది.

సౌతాంప్టన్ వేదికగా జరిగే రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో సౌతాఫ్రికాతో విరాట్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.

సఫారీలకు టెన్షన్ టెన్షన్

ప్రపంచకప్ మొదటి రెండురౌండ్ల పోటీలలో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల చేతిలో పరాజయాలు పొందిన సౌతాఫ్రికాకు..నేడు భారత్ తో జరిగే పోటీ డూ ఆర్ డైగా మారింది. వరుసగా మూడో మ్యాచ్ ఓడితే సఫారీజట్టు… సెమీస్ చేరే అవకాశం చేజార్చుకొన్నట్లవుతుంది.

ఫాబ్ డూప్లెసీ నాయకత్వంలోని సఫారీటీమ్ సర్వశక్తులూ కూడదీసుకొని…భారత్ కు గట్టిపోటీ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది.
రబాడా, ఎంగిడి, క్రిస్ హారిస్ లాంటి ఫాస్ట్ బౌలర్లు, జాదూ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్…భారత టాపార్డర్ కు సవాలు విసరనున్నారు.

ఆల్ రౌండ్ పవర్ తో భారత్….

రెండుసార్లు ప్రపంచ చాంపియన్, రెండోర్యాంకర్ భారత్ మరోసారి టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో బరిలోగి దిగుతోంది. ఆల్ రౌండ్ పవర్ తో సమరానికి సై అంటోంది.

ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు విరాట్ కొహ్లీ, ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా లాంటి ఆల్ రౌండర్లు, మహ్మద్ షమీ, బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లతో కూడిన ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ తో భారత్ తొలి విజయానికి ఉరకలేస్తోంది.

సౌతాఫ్రికాదే పైచేయి….

ప్రపంచకప్ లో భారత్ ప్రత్యర్థిగా సౌతాఫ్రికాదే పైచేయిగా ఉంది. 1992 నుంచి 2015 ప్రపంచకప్ వరకూ ఆడిన టోర్నీల్లో… సౌతాఫ్రికా 3-1 రికార్డుతో ఉంది.

అయితే…నాలుగేళ్ల క్రితం ముగిసిన 2015 ప్రపంచకప్ మ్యాచ్ లో మాత్రం భారత్ 130 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

అదే జోరును ప్రస్తుత ప్రపంచకప్ లో సైతం కొనసాగించాలన్న పట్టుదలతో విరాట్ అండ్ కో ఉన్నారు.

ఈ కీలకమ్యాచ్ లో భారత్ విజయంతో టైటిల్ వేటను ప్రారంభిస్తుందా…లేక సౌతాఫ్రికా సంచలన విజయంతో నాకౌట్ రౌండ్ ఆశలు సజీవంగా నిలుపుకోగలుగుతుందా…తేలుసుకోవాలంటే మరి కొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  4 Jun 2019 9:49 PM GMT
Next Story