Telugu Global
NEWS

ప్రతిపక్షం లేదిక.... తెలంగాణలో రాజకీయ వేడి

ప్రతిపక్షం లేదిక.. గొంతుక మూగబోవాల్సిందే.. తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మందితో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ భేటీ జరిపారు. అనంతరం నేరుగా అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ కు తాము రాష్ట్ర కాంగ్రెస్ ను టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు 12 మంది సంతకాలు చేసిన విలీన పత్రాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఇప్పుడు రోహిత్ రెడ్డితో సహా 12మంది టీఆర్ఎస్ లో చేరడంతో […]

ప్రతిపక్షం లేదిక.... తెలంగాణలో రాజకీయ వేడి
X

ప్రతిపక్షం లేదిక.. గొంతుక మూగబోవాల్సిందే.. తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మందితో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ భేటీ జరిపారు.

అనంతరం నేరుగా అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ కు తాము రాష్ట్ర కాంగ్రెస్ ను టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు 12 మంది సంతకాలు చేసిన విలీన పత్రాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు.

ఇప్పుడు రోహిత్ రెడ్డితో సహా 12మంది టీఆర్ఎస్ లో చేరడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు తగ్గింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, వీరయ్యలు మాత్రమే కాంగ్రెస్ వెంట ఉన్నారు.

విలీనం అయ్యాక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆసక్తికరంగా స్పందించారు. ఈ ప్రక్రియ రాజ్యాంగ బద్దంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు మీడియాతో అన్నారు.

ఇక కాంగ్రెస్ వాదిగా ఉండి ఇప్పుడు గులాబీ ఆకర్ష్ కు లోనైన గండ్ర వెంకటరమణారెడ్డి.. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించడం విశేషం.

తాజా ఘటనపై మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు లు నోటికి నల్లగుడ్డ కట్టుకొని నిరసన తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్న కేసీఆర్ తీరును వారు ఖండించారు. ఇలా ప్రతిపక్ష పాత్రను శూన్యం చేసి కాంగ్రెస్ కు పీడకలగా మార్చింది టీఆర్ఎస్ పార్టీ.

First Published:  6 Jun 2019 4:58 AM GMT
Next Story