ఆనంద్ దేవరకొండ-శివాత్మిక ల ‘దొరసాని’ టీజర్ రివ్యూ

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెడుతున్నాడు. తన మొదటి సినిమా తోనే ఒక మంచి కథ ని ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆనంద్.

రాజశేఖర్-జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక ఈ సినిమా తో అరంగేట్రం చేయనుంది. ఇక పోతే ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆనంద్ కి జమీందారుల కుటుంబం లో పుట్టిన శివాత్మిక కి మధ్య ప్రేమ పుడుతుంది. ఆనంద్… రాజు పాత్ర పోషిస్తుండగా, దేవకీ పాత్ర లో శివాత్మిక మెరవనుంది.

ఈ సినిమా టీజర్ ని మేకర్స్ ఈ రోజే విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ అద్భుతంగా వచ్చింది అని అందరూ ముందు నుండే ప్రమోట్ చేశారు.

ఇకపోతే ఈ సినిమా లో విజువల్స్ చాలా బాగున్నాయి. 1990 ల్లో తెలంగాణ ప్రాంతం లో జరిగిన ఒక కథ ని ఈ సినిమా లో చూపిస్తున్నారు. పల్లె వాతావరణం, అప్పటి కల్చర్ ని ఈ టీజర్ లో బాగానే చూపించారు. ఇక ఈ సినిమా కి మహేంద్ర దర్శకుడు కాగా, ఈ సినిమా ని మధుర శ్రీధర్ మరియు యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 5 న విడుదల కాబోతుంది.