Telugu Global
Health & Life Style

అటుకులు... ఆరోగ్యానికి కిటుకులు...

అటుకులతో చిటికెలో ఎటువంటి వంటకాన్ని అయినా చేసుకోవచ్చు. అంటే ఫాస్ట్‌ ఫుడ్ అన్న మాట. నిజానికి అటుకులు వల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ అటుకులు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుజేస్తాయో చూద్దాం. అటుకులు డైటింగ్ చేస్తున్న వారికి దివ్యౌషధం. అటుకులలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. వీటిలో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువే. అందుచేత రక్తహీనతకు చెక్ పెడుతుంది. అటుకులు బరువు తగ్గడానికి ఎంతో ఉపకరిస్తాయి. వీటిలో […]

అటుకులు... ఆరోగ్యానికి కిటుకులు...
X

అటుకులతో చిటికెలో ఎటువంటి వంటకాన్ని అయినా చేసుకోవచ్చు. అంటే ఫాస్ట్‌ ఫుడ్ అన్న మాట. నిజానికి అటుకులు వల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ అటుకులు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుజేస్తాయో చూద్దాం.

  • అటుకులు డైటింగ్ చేస్తున్న వారికి దివ్యౌషధం. అటుకులలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది.
  • వీటిలో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువే. అందుచేత రక్తహీనతకు చెక్ పెడుతుంది. అటుకులు బరువు తగ్గడానికి ఎంతో ఉపకరిస్తాయి.
  • వీటిలో ఉన్న కార్బొహైడ్రెట్ నిలవలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
  • వైద్య గణంకాల ప్రకారం అటుకులలో 75 నుంచి 80 శాతం వరకూ కార్బొహైడ్రెట్స్ ఉంటాయి. అలాగే 20 నుంచి 23 శాతం ఐరన్ ఉంటుంది.
  • అటుకులు తింటే షుగర్ వ్యాధి వస్తుందన్న అపోహ చాలా మందిలో ఉంది. అయితే ఇది ఎంతమాత్రం నిజం కాదని అంటున్నారు వైద్యలు.
  • అటుకులలో ఉన్న యాంటీ ఆక్సీడెంట్స్ ఎన్నో వ్యాధులను అరికడతాయి.
  • అటుకులలో లాక్టోజ్, కొవ్వు అస్సలు ఉండవు. అందువల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయన్న భయంలేదు.
  • అటుకులలో ఉన్న క్యాల్షియం శరీరంలోని ఎముకలకు, కండరాలకు ఎంతో మేలు చేస్తుంది.
  • అటుకులలో బెల్లం వేసుకుని తింటే శరీరానికి మంచి రక్తం పడుతుంది.
  • అటుకులలో పాలు పోసుకుని వివిధ పళ్లు కలుపుకుని తింటే పిల్లలు మంచి పుష్టిగా తయారవుతారు.
  • పాలిచ్చే తల్లులకు అటుకులు మంచి బలమైన ఆహారం.
First Published:  6 Jun 2019 12:16 AM GMT
Next Story