Telugu Global
Cinema & Entertainment

'హిప్పీ' సినిమా రివ్యూ

రివ్యూ: హిప్పీ రేటింగ్‌: 1/5 తారాగణం: కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్, జె.డి.చక్రవర్తి, వెన్నెల కిషోర్, ఎం.డి.అసిఫ్ తదితరులు సంగీతం: నివాస్ కె ప్రసన్న నిర్మాత: కలైపులి ఎస్ థాను దర్శకత్వం: టి.ఎన్.కృష్ణ ఆర్ఎక్స్ 100 సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ తాజాగా ‘హిప్పీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టి.ఎన్.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ సినిమా ‘జిలేబి’ ఫేమ్ దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, జజ్బా సింగ్, […]

హిప్పీ సినిమా రివ్యూ
X

రివ్యూ: హిప్పీ
రేటింగ్‌: 1/5
తారాగణం: కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్, జె.డి.చక్రవర్తి, వెన్నెల కిషోర్, ఎం.డి.అసిఫ్ తదితరులు
సంగీతం: నివాస్ కె ప్రసన్న
నిర్మాత: కలైపులి ఎస్ థాను
దర్శకత్వం: టి.ఎన్.కృష్ణ

ఆర్ఎక్స్ 100 సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ తాజాగా ‘హిప్పీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టి.ఎన్.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ సినిమా ‘జిలేబి’ ఫేమ్ దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, జజ్బా సింగ్, జె.డి.చక్రవర్తి ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఈ చిత్రం ఈరోజు విడుదలైంది.

దేవ్ (కార్తికేయ), స్నేహ (జజ్బా సింగ్) ప్రేమలో ఉంటారు. కానీ దేవ్ ఒకరోజు స్నేహ ఫ్రెండ్ అయిన ఆముక్తమాల్యద (దిగంగన సూర్యవంశీ) ని చూసి వెంటనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెను ఎలాగైనా తన వలలో పడేయాలని విశ్వ ప్రయత్నాలు మొదలు పెడతాడు. కొన్ని సంఘటనల తరువాత అముక్తమాల్యద కూడా దేవ్ ని ప్రేమిస్తుంది. కానీ తను ఏం చెప్తే అది కచ్చితంగా చేయాలి అని షరతు పెడుతుంది. దేవ్ కూడా ఆ షరతు కి ఒప్పుకుంటాడు.

కానీ కొన్ని రోజుల్లోనే వారిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలవుతాయి. వారిద్దరూ విడిపోతారు. అసలు వారిమధ్య ఏం జరిగింది? ఆనంద్ (జె.డి. చక్రవర్తి) పాత్ర ఎలా ఉంటుంది? దేవ్ మరియు ఆముక్తమాల్యద చివరికి కలిసారా? స్నేహ పరిస్థితి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో పోల్చుకుంటే కార్తికేయ ఈ సినిమాలో బాగా ఇంప్రూవ్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సరికొత్త లుక్ తో కనిపించాడు. సూర్య వంశి తన అందంతో మాత్రమే కాక నటనతో కూడా బాగానే మెప్పిస్తుంది. కార్తికేయ తో తన కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది.

జజ్బా సింగ్ పాత్రకి పర్ఫామెన్స్ కి అంత స్కోప్ లేనప్పటికీ తన పరిధి మేరకి బాగానే నటించింది అని చెప్పుకోవచ్చు. జేడీ చక్రవర్తి కూడా తన పరిధి మేరకి బాగానే నటించాడు. ఎప్పటిలాగానే అద్భుతమైన నటనను కనబరిచారు. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించాడు. కొన్ని సన్నివేశాల్లో అతని కామెడీ బాగుంది. ఎం.డి ఆసిఫ్ కూడా బాగానే నటించాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

దర్శకుడు టి.ఎన్.కృష్ణ ఈ సినిమా కోసం పెద్ద కథ అంటూ సిద్ధం చేసుకోలేదు. కేవలం రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే కథ నడపాలని ప్రయత్నించారు. ఒకరకంగా బాగానే ఉన్నా ఆ కామెడీ సీన్లు కూడా సరిగ్గా పండకపోవడం మైనస్ పాయింట్ గా మారింది. నెరేట్ చేసే విధానం కూడా అసలు బాగాలేదనే చెప్పాలి.

వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్. థాను అందించిన నిర్మాణ విలువలు పర్వాలేదు అనిపించింది. నివాస్ కే ప్రసన్న అందించిన సంగీతం బాగుంది. పాటలు కేవలం యావరేజ్ గా ఉన్నాయి. కానీ నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అతని విజువల్స్ బాగా వచ్చాయి. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపిస్తుంది.

బలాలు:

నటీనటులు, సంగీతం

బలహీనతలు:

బలమైన కథ లేకపోవడం, సహనాన్ని పరీక్షించే సన్నివేశాలు, బలవంతంగా నవ్వించాలనే కామెడీ సీన్లు

సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. కానీ సినిమా మొత్తం అంతే ఆసక్తికరంగా దర్శకుడు నడపలేకపోయాడు. మొదట హాఫ్ అంతా కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ…. కథ తక్కువ ఉంటుంది. అందులోనూ కొన్ని కామెడీ సీన్లు బలవంతంగా నవ్వు తెప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టే అనిపిస్తుంది. సరైన కథ లేకపోవడం ఈ సినిమా లో పెద్ద మైనస్ పాయింట్. మాములు కథ అయినప్పటికీ దర్శకుడు దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయాడు. కనీసం కార్తికేయ మరియు దిగంగన ల మధ్య ప్రేమ కథ కూడా ఏమాత్రం ఆకట్టుకోదు. చివరిగా ‘హిప్పీ’ చూడదగ్గ సినిమా అయితే కాదు. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన ప్రేమ కథ ‘హిప్పీ’

First Published:  6 Jun 2019 6:23 AM GMT
Next Story