Telugu Global
NEWS

ఇక విలీనమే మిగిలింది

కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్షాన్ని తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ వారంలో ఆ ప్ర‌క్రియను ముగించే దిశ‌గా పావులు క‌దుపుతోంది. హుజూర్‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బ‌లం 18కి ప‌డిపోయింది. వీరిలో ఇప్ప‌టికే 11 మంది ఎమ్మెల్యేలు అనధికారికంగా గులాబీ గూటికి చేరారు. ఇంకా ఏడుగురు మాత్రమే కాంగ్రెస్‌లో ఉన్నారు. వీరిలో ఒక‌రు టీఆర్ఎస్ వైపు వ‌స్తే సీఎల్పీ విలీనం పూర్తవుతుంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ […]

ఇక విలీనమే మిగిలింది
X

కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్షాన్ని తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ వారంలో ఆ ప్ర‌క్రియను ముగించే దిశ‌గా పావులు క‌దుపుతోంది. హుజూర్‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బ‌లం 18కి ప‌డిపోయింది. వీరిలో ఇప్ప‌టికే 11 మంది ఎమ్మెల్యేలు అనధికారికంగా గులాబీ గూటికి చేరారు. ఇంకా ఏడుగురు మాత్రమే కాంగ్రెస్‌లో ఉన్నారు. వీరిలో ఒక‌రు టీఆర్ఎస్ వైపు వ‌స్తే సీఎల్పీ విలీనం పూర్తవుతుంది.

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ లో చేర‌డం ఖాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న పాత గులాబీ లీడ‌రే. ఎమ్మెల్యే టికెట్ రాక‌పోవ‌డంతో కాంగ్రెస్‌లో చేరి తాండూరు నుంచి గెలిచారు. ఇప్పుడు ఈయ‌న టీఆర్ఎస్‌లో చేర‌డం లాంఛ‌న‌మే అంటున్నారు. ఈయ‌న పార్టీలో చేరితే ఈ వార‌మే సిఎల్పీ విలీన ప్రక్రియ పూర్తి చేయాల‌నే ఆలోచ‌న‌లో గులాబీ బాస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీధ‌ర్‌బాబు, సీత‌క్క‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, పోదెం వీర‌య్య ఉన్నారు. అయితే వీరిలో కొల్లాపూర్ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి కూడా గులాబీ గూటికి చేరే అవ‌కాశం ఉంది. దీంతో కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే మిగులుతారు. ప్ర‌తిప‌క్ష హోదాను కోల్పోతుంది. వీరికి అసెంబ్లీలో వెనుక వైపు సీట్లు కేటాయించే అవ‌కాశం ఉంది.

సీఎల్పీ విలీనానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. కాంగ్రెస్ కి ఇప్పుడు 18 మంది ఎమ్మెల్యే లు ఉన్నారు. వీరిలో 12 మంది తెరాస లో చేరితే సీఎల్పీ విలీనం సాధ్యం అవుతుంది.

రోహిత్ రెడ్డి చేరిక తో తెరాస లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 12 కి చేరుకుంటుంది. ఇక అప్పుడు టీఆర్ఎస్‌లో కాంగ్రెస్‌ విలీనాన్ని ఎవరూ ఆపలేరు.

First Published:  6 Jun 2019 1:39 AM GMT
Next Story