ప్రతీకారం ఇలా కూడా ఉంటుందా?

ఒక 26 ఏళ్ళ యువకుడు నిన్న సుళ్ళూరు పేటలోని యమహా షోరూమ్‌ వద్ద నిలబడి ఉన్నాడు. ఐదుగురు యువకులు ఒక ఆటోలో ఆయన దగ్గరకు వచ్చి చిన్న వివాదం పెట్టుకున్నారు. ఆ తరువాత అతన్ని కిడ్నాప్‌ చేసి శివార్లలోని చెట్ల పోదల్లోకి తీసుకెళ్ళి అతన్ని కొట్టారు. అంతటితో ఆగకుండా ఆ ఐదుగురు యువకులు అతనిపై అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియోలు తీశారు.

ఇక నుంచి ‘ఆ విషయంలో’ తాము చెప్పినట్లు వినకపోతే ఈ వీడియోలను యూట్యూబ్‌లో పెడతామని…. అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ వెళ్ళిపోయారు. కాసేపటికి తేరుకున్న యువకుడు సుళ్ళూరు పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంతకూ ‘ఆ విషయం’ ఏమిటంటే…. బాధితుడికి ఈ ఐదుగురిలో ఒకరి భార్యతో వివాహేతర సంబంధం ఉందని వాళ్ళ అనుమానం. అందుకు ప్రతీకారంగా అతనిపై అత్యాచారానికి పాల్పడిన విషయం విని…. ప్రతీకారం ఇలా కూడా ఉంటుందా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.