Telugu Global
NEWS

సౌరవ్ రికార్డును అధిగమించిన రోహిత్

వన్డేల్లో సౌరవ్ 22 శతకాలు 41 వన్డేలతో రెండోస్థానంలో విరాట్ కొహ్లీ వన్డే ప్రపంచకప్ లో భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించడం ద్వారా మరో రికార్డు సాధించాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 22 శతకాల రికార్డును రోహిత్ అధిగమించాడు. సౌతాంప్టన్ వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన ప్రారంభమ్యాచ్ లో రోహిత్ 144 బాల్స్ లో 122 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. తన కెరియర్ లో 23వ సెంచరీతో…. అత్యధిక సెంచరీలు […]

సౌరవ్ రికార్డును అధిగమించిన రోహిత్
X
  • వన్డేల్లో సౌరవ్ 22 శతకాలు
  • 41 వన్డేలతో రెండోస్థానంలో విరాట్ కొహ్లీ

వన్డే ప్రపంచకప్ లో భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించడం ద్వారా మరో రికార్డు సాధించాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 22 శతకాల రికార్డును రోహిత్ అధిగమించాడు.

సౌతాంప్టన్ వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన ప్రారంభమ్యాచ్ లో రోహిత్ 144 బాల్స్ లో 122 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.

తన కెరియర్ లో 23వ సెంచరీతో…. అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాట్స్ మన్ వరుసలో మూడోస్థానంలో నిలిచాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ వన్డేలలో 49 సెంచరీలు సాధిస్తే… ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీ 41 శతకాలతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

రోహిత్ 23, సౌరవ్ గంగూలీ 22 సెంచరీలతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.

First Published:  6 Jun 2019 1:37 AM GMT
Next Story