Telugu Global
Cinema & Entertainment

ఊదరగొట్టారు.... తుస్సుమనిపించారు

7 అనే సినిమా చుట్టూ జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమా ట్రయిలర్ తోనే పిచ్చెక్కిచ్చింది. తర్వాత వరుసపెట్టి పోస్టర్లు. ఇలా ప్రచారాన్ని ఓ రేంజ్ లో ఊదరగొట్టారు. అటు మేకర్స్ కూడా దీనిపై చూపించిన నమ్మకం అంతా ఇంతా కాదు. ఈ ప్రాజెక్టుపై వాళ్లు ఎంత నమ్మకం పెట్టుకున్నారంటే.. రిలీజ్ కు ముందు సినిమా శాటిలైట్ రైట్స్ వాళ్లు అమ్మలేదు. రిలీజ్ తర్వాత సినిమా ఎలాగూ హిట్ అవుతుంది కాబట్టి భారీ రేటుకు […]

ఊదరగొట్టారు.... తుస్సుమనిపించారు
X

7 అనే సినిమా చుట్టూ జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమా ట్రయిలర్ తోనే పిచ్చెక్కిచ్చింది. తర్వాత వరుసపెట్టి పోస్టర్లు. ఇలా ప్రచారాన్ని ఓ రేంజ్ లో ఊదరగొట్టారు. అటు మేకర్స్ కూడా దీనిపై చూపించిన నమ్మకం అంతా ఇంతా కాదు. ఈ ప్రాజెక్టుపై వాళ్లు ఎంత నమ్మకం పెట్టుకున్నారంటే.. రిలీజ్ కు ముందు సినిమా శాటిలైట్ రైట్స్ వాళ్లు అమ్మలేదు. రిలీజ్ తర్వాత సినిమా ఎలాగూ హిట్ అవుతుంది కాబట్టి భారీ రేటుకు అప్పుడు అమ్ముదామని అట్టిపెట్టుకున్నారు.

ఇలా భారీ అంచనాల మధ్య వచ్చిన 7 సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులకు తలనొప్పి తప్ప ఎలాంటి అనుభూతి మిగల్లేదు. ఈ సినిమాకా ఇంత పబ్లిసిటీ ఇచ్చారని అంతా ముక్కున వేలేసుకునేలా ఉంది 7 సినిమా. ఇలాంటి సినిమాపై మేకర్స్ ఎందుకంత నమ్మకం పెట్టుకున్నారో అర్థంకాక అంతా ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు.

గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుందనే నమ్మకంతో అభిషేక్ పిక్చర్స్ సంస్థ మూవీ థియేట్రికల్ రైట్స్ మొత్తం దక్కించుకుంది. ఇప్పుడు ఆ సంస్థ భారీ నష్టాలు చూడబోతోంది. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఇప్పుడు అమ్ముడుపోవడం కూడా కష్టమే.

First Published:  6 Jun 2019 5:54 AM GMT
Next Story