స్టుడియో రౌండప్ (6-6-19)

డిస్కోరాజా

రవితేజ, పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న డిస్కోరాజా సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ప్రస్తుతం ఫిలింసిటీలో రవితేజ, వెన్నెల కిషోర్ మధ్య కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. ఇదే షెడ్యూల్ లో వికారాబాద్ లో కూడా ఇంకొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. సినిమాకు సంబంధించి ఇది రెండో షెడ్యూల్

నాగశౌర్య కొత్త సినిమా

ఈ సినిమాకు అశ్వద్ధామ అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించారు. రమణ తేజ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై నాగశౌర్య నటిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. మరో 3 రోజుల్లో అన్నపూర్ణ స్టుడియోస్ కు షిప్ట్ అవుతుంది. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య ఓ సాంగ్ తీస్తారు.

మన్మధుడు-2

మన్మధుడు-2 సినిమా షూటింగ్ బ్రేక్ లేకుండా సాగుతోంది. మొన్నటికిమొన్న పోర్చుగీసులో ఈ సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. ఇలా ఇండియాకు తిరిగొచ్చిన వెంటనే అలా మరో షెడ్యూల్ షురూ చేశారు. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన లగ్జరీ హౌజ్ సెట్ లో నాగార్జున, కీర్తిసురేష్ మధ్య కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్ 

రామ్, పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కుతోంది ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాకు సంబంధించి టాకీ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. శుక్రవారం నుంచి ఈ సినిమా పాటల్ని సోషల్ మీడియాలో విడుదల చేయబోతున్నారు. వచ్చేనెల 12న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారు.

వాల్మీకి

చాన్నాళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన హరీష్ శంకర్, ప్రస్తుతం వాల్మీకి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. వచ్చే వారం నుంచి పూజా హెగ్డే జాయిన్ అవుతుంది. 14 రీల్స్ ప్లస్ అనే బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

బన్నీ కొత్త సినిమా

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ చాన్నాళ్ల కిందటే పూర్తయింది. ఆ తర్వాత బన్నీ హాలిడే ట్రిప్ కు వెళ్లిపోయాయి. నిన్నట్నుంచి సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ లోనే హీరోయిన్ పూజా హెగ్జే జాయిన్ అవుతుంది.