Telugu Global
Cinema & Entertainment

ఇంకేం చేయట్లేదు.. కేవలం జిమ్ మాత్రమే

హీరోగా పెద్ద గుర్తింపు రాకపోయినప్పటికీ ఫిజిక్ పరంగా సుధీర్ బాబుకు మంచి ఇమేజ్ ఉంది. అతడి బాడీ బిల్డింగ్ కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అదే అతడికి ఆమధ్య బాలీవుడ్ ఛాన్స్ కూడా వచ్చేలా చేసింది. ఈ సంగతి పక్కనపెడితే, ఇప్పుడు మరోసారి టాలీవుడ్ కు సుధీర్ బాబు ఫిజిక్ తో అవసరం ఏర్పడింది. పూర్తి ఫిట్ నెస్ తో ఉండాల్సిన 2 పాత్రల్ని ఒకేసారి ఒప్పుకున్నాడు సుధీర్ బాబు. అందులో ఒకటి పుల్లెల గోపీచంద్ […]

ఇంకేం చేయట్లేదు.. కేవలం జిమ్ మాత్రమే
X

హీరోగా పెద్ద గుర్తింపు రాకపోయినప్పటికీ ఫిజిక్ పరంగా సుధీర్ బాబుకు మంచి ఇమేజ్ ఉంది. అతడి బాడీ బిల్డింగ్ కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అదే అతడికి ఆమధ్య బాలీవుడ్ ఛాన్స్ కూడా వచ్చేలా చేసింది. ఈ సంగతి పక్కనపెడితే, ఇప్పుడు మరోసారి టాలీవుడ్ కు సుధీర్ బాబు ఫిజిక్ తో అవసరం ఏర్పడింది. పూర్తి ఫిట్ నెస్ తో ఉండాల్సిన 2 పాత్రల్ని ఒకేసారి ఒప్పుకున్నాడు సుధీర్ బాబు.

అందులో ఒకటి పుల్లెల గోపీచంద్ బయోపిక్ కాగా.. ఇంకోటి V అనే సినిమా. వీటిలో పుల్లెల గోపీచంద్ సినిమాకు ఫిట్ నెస్ అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ V అనే సినిమాకు కూడా బాడీ బిల్డింగ్ తప్పనిసరని దర్శకుడు ఇంద్రగంటి చెప్పాడట. ఇంకేముంది.. ఒకేసారి 2 సినిమాల కోసం కసరత్తులు ప్రారంభించాడు సుధీర్ బాబు. రోజుకు 8 గంటలు కేవలం జిమ్ లోనే గడుపుతున్నాడు.

మీరు చదివింది నిజమే.. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిన్న చిన్న గ్యాప్స్ ఇస్తూ రోజంతా జిమ్ మాత్రమే చేస్తున్నాడు సుధీర్ బాబు. పూర్తిస్థాయి ఫిట్ నెస్ సంతరించుకున్న తర్వాత, అప్పుడు ఒకేసారి రెండు సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొస్తాడట. ప్రస్తుతం సుధీర్ బాబు ఫిట్ నెస్ కు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First Published:  6 Jun 2019 5:05 AM GMT
Next Story