సమంత మనవడి పాత్ర లో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్

మెగా స్టార్ చిరంజీవి సినిమా చూడాలని ఉంది తో తెరంగేట్రం చేసి ఆ తర్వాత చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ చేసి ఇప్పుడు హీరో గా అరంగేట్రం చేసేందుకు రెడీ గా ఉన్నాడు తేజ. చూడాలని ఉంది తర్వాత ఇంద్ర, ఠాగూర్ ఇంకా చాలా సినిమాల్లో తేజ చిరు తో నటించాడు.

అయితే ఇంద్ర సినిమాలో అతను వేసిన పాత్ర కి మాత్రం ఎనలేని గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ తేజ కొద్ది రోజుల్లో రానున్న ఓ బేబీ అనే సినిమా లో సమంత తో పని చేసాడు. సినిమా లో కథ లో భాగం గా సమంత కి మనవడి పాత్ర లో తేజ నటించినట్లు సమాచారం.

సీనియర్ నటి లక్ష్మి కి మనవడి గా ఈ సినిమా లో తేజ ఉంటాడు. కాకపోతే లక్ష్మి…. యంగర్ వర్షన్ సమంత పోషించడమే కాకుండా… లక్ష్మి వయసు కి తగ్గట్టు నటిస్తూ ఉంటుంది కనుక…. ఈ సినిమా లో తేజ సమంత కి మనవడి పాత్రలో లో కనిపిస్తాడు. సమంత తో కొన్ని ఆసక్తికర సీన్ల లో నటించాడు తేజ. తేజ తనే సొంతం గా ఒక సినిమా తో అరంగేట్రం చేయాలని అనుకున్నాడు…. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అవడం తో ఈ సినిమా చేసాడు.

నందిని రెడ్డి దర్శకత్వం లో రానున్న ఈ చిత్రం జులై 5 న విడుదల కానుంది.