Telugu Global
NEWS

ధర్మానకు షాకిచ్చిన జగన్.... కారణమిదేనా?

వైసీపీ కేబినెట్ లో మంత్రులుగా నియామకం అయ్యేవారికి తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ చేసి మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాలని చెబుతున్నారు. ఆ కోవలోనే ఇప్పటికే బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, సుచరితలను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని.. రేపు మంత్రిగా ప్రమాణం చేయడానికి రెడీ కావాలని విజయసాయిరెడ్డి కోరినట్లు తెలిసింది. తాజాగా మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లాయి. తాజాగా ఫోన్ అందుకున్న వారిలో ధర్మాన కృష్ణదాస్, బుగ్గన, కొడాలి నాని, […]

ధర్మానకు షాకిచ్చిన జగన్.... కారణమిదేనా?
X

వైసీపీ కేబినెట్ లో మంత్రులుగా నియామకం అయ్యేవారికి తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ చేసి మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాలని చెబుతున్నారు. ఆ కోవలోనే ఇప్పటికే బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, సుచరితలను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని.. రేపు మంత్రిగా ప్రమాణం చేయడానికి రెడీ కావాలని విజయసాయిరెడ్డి కోరినట్లు తెలిసింది.

తాజాగా మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లాయి. తాజాగా ఫోన్ అందుకున్న వారిలో ధర్మాన కృష్ణదాస్, బుగ్గన, కొడాలి నాని, పార్థసారథికి మంత్రి పదవులు ఖాయమయ్యాయి. వీరికి ఫోన్ చేసిన విజయసాయిరెడ్డి మంత్రులుగా తీసుకుంటున్నామని చెప్పారు.

అయితే ఆశ్చర్యకరంగా శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ రావును కాదని.. ఆయన సోదరుడు అయిన ధర్మాన కృష్ణ దాస్ కు జగన్ మంత్రివర్గంలో చోటు దక్కడం చర్చనీయాంశంగా మారింది. అయితే వైసీపీ అధిష్టానం లెక్కలేసుకున్న ప్రకారం శ్రీకాకుళం ఎంపీ సీటులో టీడీపీ గెలుపునకు ధర్మాన సహకరించారన్న నివేదికలు వైసీపీకి అందడమే జగన్ ఈ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు..

శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడుకు…. ధర్మాన పోటీచేసిన శ్రీకాకుళంలో మెజార్టీ ఓట్లు పడ్డాయి. ఎమ్మెల్యేగా ధర్మానకు వేసిన వారు ఎంపీగా రామ్మోహన్ నాయుడుకు వేశారు. ఈ క్రాస్ ఓటింగ్ కు కారణం ధర్మాన అని.. ధర్మాన, రామ్మోహన్ నాయుడు ఇద్దరు ఒకే సామాజికవర్గం కావడంతోనే ఇలా సహకరించి ఉంటారన్న నివేదిక వైసీపీ అధిష్టానానికి చేరినట్టు తెలిసింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి కళింగ సామాజికవర్గం వ్యక్తి కావడంతోనే ధర్మాన సహకరించలేదన్న నివేదికలు వచ్చినట్టు తెలిసింది. అందుకే ధర్మానకు మంత్రివర్గంలో చోటు లేకుండా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

First Published:  7 Jun 2019 11:07 AM GMT
Next Story