ఫ్రెంచ్ ఓపెన్ మహిళ సింగిల్స్ ఫైనల్లో బార్టీ, మార్కెటా

  • సెమీస్ లోనే ముగిసిన అమండా పోటీ

2019 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు ఆస్ట్రేలియా ప్లేయర్, 8వ సీడ్ యాష్లీగా బార్టీ, చెక్ యువసంచలనం మార్కెటా వోండరుసోవా చేరుకొన్నారు.

పారిస్ లోని రోలాండ్ గారోస్ స్టేడియంలో ముగిసిన తొలి సెమీఫైనల్లో 8వ సీడ్ బార్టీ మూడుసెట్ల పోరులో…అమెరికన్ టీనేజర్ అమండా అనిస్ మోవాను అధిగమించింది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో బార్టీ 6-7, 6-3, 6-3తో విజేతగా నిలిచింది. కంగారూ ప్లేయర్ బార్టీ…తన కెరియర్ లో ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి.

కోంటాకు మార్కెటా షాక్..

మరో సెమీఫైనల్లో చెక్ ప్లేయర్ , 17 ఏళ్ల మార్కెటా వోండ్రుసోవా 7-5, 7-6తో బ్రిటీష్ ప్లేయర్ యోహానా కోంటాను అధిగమించింది. శనివారం జరిగే టైటిల్ సమరంలో బార్టీతో మార్కెటా అమీతుమీ తేల్చుకోనుంది.