Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ అని పరోక్షంగా ఒప్పుకున్నాడా?

ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అయితే దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు హీరోలు. మొన్నటికిమొన్న వినయ విధేయ రామ డిజాస్టర్ అయితే ఓపెన్ లెటర్ రాసి మరీ ఫ్లాప్ ను అంగీకరించాడు హీరో రామ్ చరణ్. అంతకంటే ముందు విజయ్ దేవరకొండ కూడా అలానే రియాక్ట్ అయ్యాడు. తను నటించిన నోటా సినిమా ఫ్లాప్ అయిందని ఏకంగా ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు సూర్య వంతు వచ్చింది. కానీ అంత స్ట్రయిట్ గా మేటర్ ను ఒప్పుకోలేదు […]

ఫ్లాప్ అని పరోక్షంగా ఒప్పుకున్నాడా?
X

ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అయితే దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు హీరోలు. మొన్నటికిమొన్న వినయ విధేయ రామ డిజాస్టర్ అయితే ఓపెన్ లెటర్ రాసి మరీ ఫ్లాప్ ను అంగీకరించాడు హీరో రామ్ చరణ్. అంతకంటే ముందు విజయ్ దేవరకొండ కూడా అలానే రియాక్ట్ అయ్యాడు. తను నటించిన నోటా సినిమా ఫ్లాప్ అయిందని ఏకంగా ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు సూర్య వంతు వచ్చింది. కానీ అంత స్ట్రయిట్ గా మేటర్ ను ఒప్పుకోలేదు ఈ హీరో.

తను నటించిన ఎన్జీకే సినిమాపై వచ్చిన ప్రశంసలు, విమర్శలు, అభిప్రాయాలన్నింటినీ గౌరవిస్తున్నానని ట్వీట్ చేశాడు సూర్య. తన సినిమాని డీకోడ్ (రివ్యూ) చేసిన మాస్టర్ మైండ్స్ (సమీక్షకులు) కు థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ వ్యంగ్యంగా ఓ ఎమోజీ కూడా పెట్టాడు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ కు మరోసారి కృతజ్ఞతలు చెప్పాడు.

మొత్తంగా ఎన్జీకే సినిమా పెద్దగా ఆడలేదని, ఫ్లాప్ అయిందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించాడు సూర్య. నందగోపాల కృష్ణ పాత్రలో సూర్య చేసిన యాక్టింగ్ బాగున్నప్పటికీ.. కథ, కథనంలో తప్పుల వల్ల సినిమా తెలుగు-తమిళ భాషల్లో ఫ్లాప్ అయింది. విమర్శకులు ఈ సినిమాను చీల్చిచెండాడారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, నష్టనివారణ చర్యల్లో భాగంగా ఇలా నర్మగర్బంగా ట్వీట్ చేసినట్టున్నాడు సూర్య

First Published:  7 Jun 2019 6:00 AM GMT
Next Story