Telugu Global
Cinema & Entertainment

సెంటిమెంట్ ఫాలో అవుతున్న నితిన్

ఒకటి కాదు, రెండు కాదు…. ఒక దశలో ఏకంగా 10 ఫ్లాపులిచ్చాడు నితిన్. ఇక అతడి కెరీర్ క్లోజ్ అని అనుకున్నారంతా. అలాంటి టైమ్ లో నితిన్ కెరీర్ కు ఆక్సిజన్ అందించింది ఇష్క్ సినిమా. ఆ సినిమా తర్వాత మళ్లీ వెనక్కితిరిగి చూడలేదు ఈ హీరో. మళ్లీ ఇన్నాళ్లకు నితిన్ కెరీర్ లో చిన్న గ్యాప్ వచ్చింది. దీంతో అప్పటి సెంటిమెంట్ ను మరోసారి రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ఈ హీరో. అవును.. ఇష్క్ […]

సెంటిమెంట్ ఫాలో అవుతున్న నితిన్
X

ఒకటి కాదు, రెండు కాదు…. ఒక దశలో ఏకంగా 10 ఫ్లాపులిచ్చాడు నితిన్. ఇక అతడి కెరీర్ క్లోజ్ అని అనుకున్నారంతా. అలాంటి టైమ్ లో నితిన్ కెరీర్ కు ఆక్సిజన్ అందించింది ఇష్క్ సినిమా. ఆ సినిమా తర్వాత మళ్లీ వెనక్కితిరిగి చూడలేదు ఈ హీరో. మళ్లీ ఇన్నాళ్లకు నితిన్ కెరీర్ లో చిన్న గ్యాప్ వచ్చింది. దీంతో అప్పటి సెంటిమెంట్ ను మరోసారి రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ఈ హీరో.

అవును.. ఇష్క్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన పీసీ శ్రీరామ్ ను తన నెక్ట్స్ సినిమాకు తీసుకుంటున్నాడు నితిన్. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న వెంకీ అట్లూరి సినిమా కోసం పీసీ శ్రీరామ్ ను డీవోపీగా తీసుకున్నారు. రీసెంట్ గా సరైన సక్సెస్ అందుకోలేకపోయిన ఈ హీరో, ఇలా సెంటిమెంట్ ను రిపీట్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది వెంకీ అట్లూరి-నితిన్ సినిమా. ఇంతకుముందు తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాల్ని తీసిన వెంకీ, మరో అందమైన విభిన్నమైన ప్రేమకథతో నితిన్ ను ఒప్పించాడు.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమా కోసం దాదాపు అంతా కొత్త టెక్నీషియన్స్ ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. మ్యూజిక్ డైరక్టర్ గా కూడా ఎవరో కొత్త వ్యక్తిని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు.

First Published:  7 Jun 2019 5:48 AM GMT
Next Story