ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో స్పానిష్ బుల్

  • సెమీస్ లో ఫెదరర్ పై నడాల్ విజయం
  • 12వ టైటిల్ కు అడుగు దూరంలో నడాల్

ఫ్రెంచ్ ఓపెన్ కింగ్ రాఫెల్ నడాల్..2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ కు అలవోకగా చేరుకొన్నాడు. పారిస్ లోని రోలాండ్ గారోస్ సెంటర్ స్టేడియంలో ముగిసిన తొలి సెమీఫైనల్లో రెండోసీడ్ నడాల్ వరుస సెట్లలో మూడోసీడ్ రోజర్ ఫెదరర్ ను చిత్తు చేసి…12వ టైటిల్ కు గెలుపు దూరంలో నిలిచాడు.

ఏకపక్షంగా సాగిన సెమీస్ పోరులో నడాల్ 6-3, 6-4, 6-2తో విజేతగా నిలిచాడు. ఫెదరర్ ప్రత్యర్థిగా క్లేకోర్టు ల్లో 13-2 రికార్డుతో ఉన్న నడాల్.. ఓవరాల్ గా 23 విజయాలు, 15 పరాజయాల రికార్డుతో ఉన్నాడు.

తన కెరియర్ లో ఇప్పటికే 11 ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీలు అందుకొన్న నడాల్..12వ టైటిల్ సాధించడం ద్వారా తన రికార్డును తానే అధిగమించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జోకోవిచ్-డోమనిక్ థైమ్ ల రెండో సెమీస్ లో నెగ్గిన ఆటగాడితో నడాల్ టైటిల్ సమరంలో పోటీపడతాడు.