ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ లో యాష్లీగీ బార్టీ

  • ఫైనల్ బెర్త్ కోసం అనిస్ మోవాతో ఢీ

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ కు ఆస్ట్రేలియా ప్లేయర్, 8వ సీడ్ యాష్లీగీ బార్టీ చేరుకొంది. వర్షం కారణంగా ఆలస్యంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో…బార్టీ 6-3, 7-5తో మాడిసన్ కీస్ ను అధిగమించి తన కెరియర్ లో తొలిసారి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ లో అమెరికన్ ప్లేయర్ అమండా అనీస్ మోవాతో తలపడుతుంది.

హాలెప్ కు అమండా షాక్..

మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హాలెప్ పై…అమెరికా యువసంచలనం అమండా అనీస్ మోవా అనూహ్య విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో 17 ఏళ్ల అమండా 6-2, 6-4తో హాట్ ఫేవరెట్ హాలెప్ ను చిత్తు చేసి…తన కెరియర్ లో తొలిసారి గ్రాండ్ స్లామ్ సెమీస్ బెర్త్ సంపాదించింది.

ఫైనల్లో చోటు కోసం…ఆస్ట్రేలియా డార్క్ హార్స్ యాష్లీగీ బార్టీతో అమీతుమీ తేల్చుకోనుంది.

డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హాలెప్ క్వార్టర్స్ లోనే ఇంటిదారి పట్టడంతో…సరికొత్త చాంపియన్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.