Telugu Global
Cinema & Entertainment

'సాహో'.... సోషల్ మీడియా కథ !

ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘సాహో’. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అనే విషయంపై ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. తాజాగా ఈ సినిమా కథ సోషల్ మీడియాలో లీక్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ ఒక నకిలీ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో విలన్ […]

సాహో.... సోషల్ మీడియా కథ !
X

ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘సాహో’. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అనే విషయంపై ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. తాజాగా ఈ సినిమా కథ సోషల్ మీడియాలో లీక్ అయింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ ఒక నకిలీ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో విలన్ ఒక అండర్ వరల్డ్ డాన్, అతని ఆటలు కట్టించడానికి ప్రభాస్ నకిలీ ఇంటర్ పోల్ ఆఫీసర్ అవతారం ఎత్తుతాడు. ఆ డాన్ అనుచరులు అందరినీ ఒక్కొక్కరిగా మట్టి పెడుతూ ఉంటాడు ప్రభాస్.

అయితే ఫ్లాష్ బ్యాక్ లో హీరో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులని డాన్ హత్య చేస్తాడు. దానికి ప్రతీకారం తీర్చుకునేందుకే హీరో నకిలీ ఇంటర్ పోల్ అధికారి గా మారతాడు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలను చూస్తే ఈ స్టోరీ లైన్ కరెక్ట్ అని అనిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. జాకీష్రాఫ్, మందిరా బేడీ, నీల్ నితిన్ ముకేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతోంది.

First Published:  7 Jun 2019 6:56 AM GMT
Next Story