Telugu Global
Cinema & Entertainment

నరేష్ కి అందుకే ఆఫర్లు తగ్గిపోయాయా?

పైకి కనిపించడానికి ఎలా ఉన్నా, సినిమా ఇండస్ట్రీలో కూడా ఈగోలు ఉంటూనే ఉంటాయి. స్టార్ డం ఎంజాయ్ చేస్తున్న వారితో మిగతా వారందరూ సత్సంబంధాలు మెయింటెన్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గత కొంతకాలంగా సీనియర్ యాక్టర్ నరేష్ కు సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. ‘భలే భలే మగాడివోయ్’ వంటి చిత్రాలలో నటించినప్పటికీ… ఆ తరువాత అలాంటి పాత్రలు అతనికి దొరకటం లేదు. 2018 మొదటినుంచి నరేష్ కు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. […]

నరేష్ కి అందుకే ఆఫర్లు తగ్గిపోయాయా?
X

పైకి కనిపించడానికి ఎలా ఉన్నా, సినిమా ఇండస్ట్రీలో కూడా ఈగోలు ఉంటూనే ఉంటాయి. స్టార్ డం ఎంజాయ్ చేస్తున్న వారితో మిగతా వారందరూ సత్సంబంధాలు మెయింటెన్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

గత కొంతకాలంగా సీనియర్ యాక్టర్ నరేష్ కు సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. ‘భలే భలే మగాడివోయ్’ వంటి చిత్రాలలో నటించినప్పటికీ… ఆ తరువాత అలాంటి పాత్రలు అతనికి దొరకటం లేదు. 2018 మొదటినుంచి నరేష్ కు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

ఆఖరిగా నరేష్ నటించిన పెద్ద సినిమా అంటే ఈ ఏడాది విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్… కానీ అందులో కూడా నరేష్ పాత్ర చెప్పుకోదగ్గదేం కాదు. తాజాగా మా ఎన్నికలలో నరేష్ రాజకీయాలు చూసి అతనికి సినిమా అవకాశాలు ఎవరూ ఇవ్వడం లేదని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

అయితే మరికొందరు మాత్రం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నరేష్ బిజీగా ఉండటం వల్ల సినిమాలు చేయలేకపోతున్నారని అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ మళ్లీ నరేష్ సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

First Published:  7 Jun 2019 3:21 AM GMT
Next Story