Telugu Global
Cinema & Entertainment

ఒకేసారి 2 బ్రేకింగ్ న్యూస్ లు

బన్నీ-త్రివిక్రమ్ సినిమా సెకెండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో నడుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ మూవీకి సంబంధించి ఒకేసారి 2 బ్రేకింగ్ న్యూస్ లు బయటపెట్టారు మేకర్స్. సినిమాకు సంబంధించి పుకార్లుగా ఉన్న రెండు అంశాలపై ఈరోజు క్లారిటీ ఇచ్చారు. అందులో ఒకటి సెకెండ్ హీరోయిన్. ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా చాలా స్పెక్యులేషన్ నడిచింది. ఎట్టకేలకు ఆ ఛాన్స్ నివేత పెతురాజ్ ను వరించింది. మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ […]

ఒకేసారి 2 బ్రేకింగ్ న్యూస్ లు
X

బన్నీ-త్రివిక్రమ్ సినిమా సెకెండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో నడుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ మూవీకి సంబంధించి ఒకేసారి 2 బ్రేకింగ్ న్యూస్ లు బయటపెట్టారు మేకర్స్. సినిమాకు సంబంధించి పుకార్లుగా ఉన్న రెండు అంశాలపై ఈరోజు క్లారిటీ ఇచ్చారు. అందులో ఒకటి సెకెండ్ హీరోయిన్.

ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా చాలా స్పెక్యులేషన్ నడిచింది. ఎట్టకేలకు ఆ ఛాన్స్ నివేత పెతురాజ్ ను వరించింది. మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ, తాజాగా సాయితేజ్ సరసన చిత్రలహరి సినిమాలో నటించింది. ఇప్పుడు ఏకంగా బన్నీ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైనదంటోంది యూనిట్.

ఇక బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి రెండో అప్ డేట్ సుషాంత్. ఈ అక్కినేని హీరో కూడా బన్నీ సినిమాలో ఉన్నాడు. చిలసౌ సక్సెస్ తర్వాత మరో ఆఫర్ దక్కించుకోలేకపోయిన ఈ హీరో, ఎట్టకేలకు ఇలా బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో ఓ మంచి పాత్రలో కనిపించబోతున్నాడు.

మొత్తానికి ప్రాజెక్టుకు సంబంధించి రెండు కీలకమైన క్లారిటీలు వచ్చేయడంతో.. ఇప్పటివరకు నడుస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్టయింది. నెల రోజుల పాటు సాగనున్న రెండో షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా ఎనౌన్స్ చేయాలని భావిస్తున్నారు. అంటే, బన్నీ సినిమా ఊపందుకుందన్నమాట.

First Published:  7 Jun 2019 5:44 AM GMT
Next Story