Telugu Global
NEWS

ప్రపంచకప్ లో మరో సరికొత్త రికార్డు

8వ డౌన్ లో కౌంటర్ నైల్ అత్యధిక స్కోరు రౌండ్ రాబిన్ లీగ్ లో ఆసీస్ రెండో గెలుపు వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం సాధించింది. నాటింగ్ హామ్ వేదికగా ముగిసిన రెండోరౌండ్ పోటీలో 5వ ర్యాంకర్ ఆస్ట్రేలియా గట్టి పోటీ ఎదుర్కొని 15 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ విండీస్ ను అధిగమించింది. తమతమ ప్రారంభమ్యాచ్ ల్లో శ్రీలంకను విండీస్, అప్ఘనిస్థాన్ ను ఆస్ట్రేలియా జట్లు చిత్తు చేసిన జోరుతో…రెండోరౌండ్ […]

ప్రపంచకప్ లో మరో సరికొత్త రికార్డు
X
  • 8వ డౌన్ లో కౌంటర్ నైల్ అత్యధిక స్కోరు
  • రౌండ్ రాబిన్ లీగ్ లో ఆసీస్ రెండో గెలుపు

వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం సాధించింది. నాటింగ్ హామ్ వేదికగా ముగిసిన రెండోరౌండ్ పోటీలో 5వ ర్యాంకర్ ఆస్ట్రేలియా గట్టి పోటీ ఎదుర్కొని 15 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ విండీస్ ను అధిగమించింది.

తమతమ ప్రారంభమ్యాచ్ ల్లో శ్రీలంకను విండీస్, అప్ఘనిస్థాన్ ను ఆస్ట్రేలియా జట్లు చిత్తు చేసిన జోరుతో…రెండోరౌండ్ సమరానికి సిద్ధమయ్యాయి.

కౌంటర్ నైల్ సరికొత్త రికార్డు….

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 288 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒకదశలో 190 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీదుతున్న కంగారూ టీమ్ ను మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, 8వ నంబర్ ఆటగాడు కౌంటర్ నైల్…కీలక భాగస్వామ్యంతో ఆదుకొన్నారు.

ఇద్దరూ భారీ హాఫ్ సెంచరీలతో తమజట్టుకు మ్యాచ్ విన్నింగ్ స్కోరు అందించారు. స్మిత్ 103 బాల్స్ లో 7 బౌండ్రీలతో 73 పరుగులు, కౌంటర్ నైల్ 63 బాల్స్ లోనే 92 పరుగుల స్కోర్లతో తమజట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.

ప్రపంచకప్ చరిత్రలో 8వ డౌన్ లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా కౌంటర్ నైల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

చేజింగ్ లో కరీబియన్ టీమ్ బోల్తా….

2894 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన కరీబియన్ టీమ్…50 ఓవర్లలో 9 వికెట్లకు 273 పరుగులు మాత్రమే చేయగలిగింది. షియా హోప్ 68 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ 46 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

అత్యంత వేగంగా 150 వికెట్లు….

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్ గా మిషెల్ స్టార్క్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు..ప్రస్తుత ప్రపంచకప్ లో 5 వికెట్లు పడగొట్టిన తొలిబౌలర్ ఘనతను స్టార్క్ సొంతం చేసుకొన్నాడు.

ఆస్ట్రేలియా విజయంలో ప్రధానపాత్ర వహించిన ఆల్ రౌండర్ కౌంటర్ నైల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ నెల 9న జరిగే మూడో రౌండ్ పోటీలో ప్రపంచ రెండో ర్యాంకర్ భారత్ తో ఆస్ట్రేలియా తలపడనుంది.

First Published:  7 Jun 2019 12:03 AM GMT
Next Story