Telugu Global
Cinema & Entertainment

వాయిదాపడిన ఆది సాయి కుమార్ సినిమా 

‘ప్రేమకావాలి’ సినిమాతో మంచి హిట్ అందుకున్నప్పటికీ ఆది సాయి కుమార్ మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయాడు. ‘నెక్స్ట్ నువ్వే’ సినిమా తో మరొక డిజాస్టర్ ను అందుకున్న ఆది కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. తాజాగా ఇప్పుడు ఆది నటించిన ‘బుర్రకథ’ త్వరలో విడుదల కాబోతోంది. ఇంతకుముందు ఈ సినిమాని మే 24న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ అనుకున్న తేదీకి విడుదల చేయలేక పోయారు. తాజా సమాచారం ప్రకారం ‘బుర్రకథ’ […]

వాయిదాపడిన ఆది సాయి కుమార్ సినిమా 
X

‘ప్రేమకావాలి’ సినిమాతో మంచి హిట్ అందుకున్నప్పటికీ ఆది సాయి కుమార్ మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయాడు.

‘నెక్స్ట్ నువ్వే’ సినిమా తో మరొక డిజాస్టర్ ను అందుకున్న ఆది కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

తాజాగా ఇప్పుడు ఆది నటించిన ‘బుర్రకథ’ త్వరలో విడుదల కాబోతోంది. ఇంతకుముందు ఈ సినిమాని మే 24న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ అనుకున్న తేదీకి విడుదల చేయలేక పోయారు.

తాజా సమాచారం ప్రకారం ‘బుర్రకథ’ సినిమా విడుదల తేదీని జూన్ 28 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ స్టోరీ రైటర్ డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. మిష్టి చక్రాబోర్తి మరియు నైరా షా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

శ్రీకాంత్ దీపాల నిర్మించిన ఈ సినిమాలో ఆది ఒక సరికొత్త మరియు ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. మరి ఈ సినిమాతో అయినా అది మంచి కం బ్యాక్ ఇవ్వగలడో లేదో చూడాలి. ఆది మాత్రం తన ఆశలన్నీ ప్రస్తుతం ఈ చిత్రంపైనే పెట్టుకున్నాడు.

First Published:  8 Jun 2019 12:26 AM GMT
Next Story