ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ లోనే జోకోవిచ్ కు షాక్

  • ఐదుసెట్ల పోరులో జోకోకు థైమ్ దెబ్బ
  • ఫైనల్లో నడాల్ తో థైమ్ ఢీ

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా…టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ రాడ్ లేవర్ సరసన నిలవాలన్న ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ కలలు కల్లలయ్యాయి.

టాప్ సీడ్ గా టైటిల్ వేటకు దిగిన జోకోవిచ్ కు…ఆస్ట్రియా ఆటగాడు, 4వ సీడ్ డోమనిక్ థైమ్ ఐదుసెట్ల పోరులో అనుకోని దెబ్బ కొట్టాడు.

వర్షంతో పలుమార్లు అంతరాయమేర్పడిన ఈ సెమీస్ పోరులో డోమనిక్ థైమ్ 6-2, 3-6, 7-5, 5-7, 7-5 తో జోకోవిచ్ పై సంచలన విజయం సాధించాడు.

ఫైనల్లో చోటు కోసం జరిగే సూపర్ సండే టైటిల్ ఫైట్ లో 11సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ రాఫెల్ నడాల్ తో డోమనిక్ థైమ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

తన కెరియర్ లో 12వసారి ఫ్రెంచ్ ఫైనల్స్ చేరిన నడాల్ రికార్డుస్థాయిలో 12వసారి విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

మరోవైపు… గత నాలుగేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరుతూ వస్తున్న డోమనిక్ థైమ్…టైటిల్ సమరానికి అర్హత సాధించడం ఇదే మొదటిసారి.