Telugu Global
Cinema & Entertainment

ఫలక్ నుమా దాస్ సీక్వెల్ కూడా

ఫలక్ నుమా దాస్.. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన సినిమా ఇది. వివాదాలు ఎక్కువ, టాక్ తక్కువ అన్నట్టు తయారైంది ఈ సినిమా పరిస్థితి. సినిమా రిలీజ్ కు ముందు నుంచే ఏదో ఒక వివాదం. మొత్తమ్మీద సురేష్ బాబు చలవతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నైజాంలో బాగానే ఆడుతోంది. ఆంధ్రాలో అంతంతమాత్రంగా నడుస్తోంది. ఓవరాల్ గా 4 కోట్ల రూపాయల వసూళ్లు తెచ్చుకుంది. దర్శకుడిగా తను చేసిన తొలి సినిమా సూపర్ హిట్ అయిందంటున్నాడు […]

ఫలక్ నుమా దాస్ సీక్వెల్ కూడా
X

ఫలక్ నుమా దాస్.. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన సినిమా ఇది. వివాదాలు ఎక్కువ, టాక్ తక్కువ అన్నట్టు తయారైంది ఈ సినిమా పరిస్థితి. సినిమా రిలీజ్ కు ముందు నుంచే ఏదో ఒక వివాదం. మొత్తమ్మీద సురేష్ బాబు చలవతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నైజాంలో బాగానే ఆడుతోంది. ఆంధ్రాలో అంతంతమాత్రంగా నడుస్తోంది. ఓవరాల్ గా 4 కోట్ల రూపాయల వసూళ్లు తెచ్చుకుంది.

దర్శకుడిగా తను చేసిన తొలి సినిమా సూపర్ హిట్ అయిందంటున్నాడు డైరక్టర్ కమ్ హీరో విశ్వక్ సేన్. ఇదే ఉత్సాహంతో ఫలక్ నుమా దాస్ సినిమాకు సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు. సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన విశ్వక్ సేన్.. ఇండస్ట్రీలో తనను ఎవరూ తొక్కలేరని.. ఫలక్ నుమా దాస్ సినిమాకు పార్ట్-2 తీసి చూపిస్తానని ప్రకటించుకున్నాడు. అన్నట్టు ఈ సినిమాకు నిర్మాత కూడా అతడే. విశ్వక్ సేన్ తండ్రి ఈ సినిమాకు డబ్బులు పెట్టాడు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ గా ఫలక్ నుమా దాస్ వచ్చింది. మలయాళంలో దీనికి సీక్వెల్ రాలేదు. దాంతో సంబంధం లేకుండా తెలుగులో మాత్రం సీక్వెల్ తీస్తానంటున్నాడు విశ్వక్ సేన్. అంటే.. ఈసారి ఎలాంటి రిఫరెన్స్ లేకుండా తనకుతానుగా సొంతంగా స్క్రిప్ట్ రాసుకోవాలన్నమాట. సో.. విశ్వక్ సేన్ లో అసలైన దర్శకుడి యాంగిల్ ఎంతుందో ఈ సీక్వెల్ తో తేలిపోతుందన్నమాట.

అన్నట్టు ఫలక్ నుమా దాస్ సినిమాకు ప్రజెంటర్ గా వ్యవహరించిన సురేష్ బాబు.. సీక్వెల్ ను కూడా భుజానికెత్తుకుంటాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదాల వల్ల సినిమాకు టోటల్ గా దూరమయ్యారు సురేష్ బాబు. మరి పార్ట్-2లో ఆయన ఉంటాడో, తప్పుకుంటాడో చూడాలి.

First Published:  8 Jun 2019 9:00 AM GMT
Next Story