Telugu Global
Cinema & Entertainment

ఇస్మార్ట్ శంకర్.... 'దిమాక్ ఖరాబ్' అంటున్న.... మణిశర్మ

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఇప్పుడు మళ్ళీ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నట్లే మణిశర్మ అందించిన సంగీతం పైన కూడా అన్నే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన మొదటి పాట ‘దిమాక్ ఖరాబ్’ ను ఇవాళ విడుదల చేశారు. ఒక మాస్ నంబర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]

ఇస్మార్ట్ శంకర్.... దిమాక్ ఖరాబ్ అంటున్న.... మణిశర్మ
X

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఇప్పుడు మళ్ళీ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నట్లే మణిశర్మ అందించిన సంగీతం పైన కూడా అన్నే అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన మొదటి పాట ‘దిమాక్ ఖరాబ్’ ను ఇవాళ విడుదల చేశారు. ఒక మాస్ నంబర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాట చాలా ఎనర్జిటిక్ గా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది.

మణిశర్మ మొదటి నుంచి ఆఖరి వరకు అదే టెంపోను మెయింటెన్ చేస్తూ ఒక ఎనర్జిటిక్ పాటను అందించారు. సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది కాబట్టి మణిశర్మ ఈ పాట సాహిత్యంలో కూడా కొంత తెలంగాణ బ్యాక్ డ్రాప్ వచ్చేలా చూసుకున్నారు.

మొత్తానికి ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. నిధి అగర్వాల్ మరియు నభ నటేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 12న విడుదల కాబోతుంది.

First Published:  8 Jun 2019 12:33 AM GMT
Next Story