Telugu Global
NEWS

ముఖ్యమంత్రిగా సచివాలయాకి జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం తొలిసారిగా సచివాలయానికి వెళ్లారు. ఉదయం 8గంటల 39 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ఛాంబర్ లో ప్రవేశించారు. ఆ తర్వాత 8 గంటల 50 నిమిషాలకు ముఖ్యమంత్రిగా తొలి సంతకం పెట్టారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తల్లి విజయమ్మ, భార్య భారతి వీడ్కోలు పలికారు. అక్కడి నుంచి పదిహేను నిమిషాలలో సచివాలయానికి చేరుకున్నారు జగన్‌. ముఖ్యమంత్రి ఛాంబర్ కు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఏపీ ఎన్జీవో సంఘాలకు చెందిన నాయకులతో పాటు […]

ముఖ్యమంత్రిగా సచివాలయాకి జగన్
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం తొలిసారిగా సచివాలయానికి వెళ్లారు. ఉదయం 8గంటల 39 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ఛాంబర్ లో ప్రవేశించారు. ఆ తర్వాత 8 గంటల 50 నిమిషాలకు ముఖ్యమంత్రిగా తొలి సంతకం పెట్టారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తల్లి విజయమ్మ, భార్య భారతి వీడ్కోలు పలికారు.

అక్కడి నుంచి పదిహేను నిమిషాలలో సచివాలయానికి చేరుకున్నారు జగన్‌. ముఖ్యమంత్రి ఛాంబర్ కు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఏపీ ఎన్జీవో సంఘాలకు చెందిన నాయకులతో పాటు సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజలు చేసి కొబ్బరి కాయ కొట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

అనంతరం వేద పండితుల ఆశీర్వాదాన్ని అందుకున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఆశీనులయ్యారు. తన ఛాంబర్ లో ఉన్న తండ్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసిన జగన్మోహన్ రెడ్డి ఆయనకు నమస్కరించి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యంతో పాటు నూతనంగా మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్న శాసనసభ్యులు, పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి, పార్టీ నాయకులు ఎస్.వి.సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సచివాలయ ఉద్యోగులతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.

ఉదయం 10 గంటలకు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

First Published:  7 Jun 2019 11:59 PM GMT
Next Story