Telugu Global
Cinema & Entertainment

స్టార్ హీరోల మీద షాకింగ్ కామెంట్స్ చేసిన తేజ

దర్శకుడు తేజ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకొని సినిమా లు చేస్తూ ఈ దశ కి వచ్చారు. అయితే ఇటీవలే సీత అనే సినిమా తో మన ముందుకు వచ్చి ప్రేక్షకులని మెప్పించడంలో విఫలమైన తేజ మీడియా తో మాట్లాడారు. ఆయన దర్శకుడి గా తన పని తాను చేసుకుంటూ వెళ్తాను అనే విషయాన్నీ స్పష్టం చేశారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తో విజయం అందుకున్నా…. సీత సినిమా తో మళ్ళీ ఫెయిల్యూర్ […]

స్టార్ హీరోల మీద షాకింగ్ కామెంట్స్ చేసిన తేజ
X

దర్శకుడు తేజ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకొని సినిమా లు చేస్తూ ఈ దశ కి వచ్చారు. అయితే ఇటీవలే సీత అనే సినిమా తో మన ముందుకు వచ్చి ప్రేక్షకులని మెప్పించడంలో విఫలమైన తేజ మీడియా తో మాట్లాడారు. ఆయన దర్శకుడి గా తన పని తాను చేసుకుంటూ వెళ్తాను అనే విషయాన్నీ స్పష్టం చేశారు.

నేనే రాజు నేనే మంత్రి సినిమా తో విజయం అందుకున్నా…. సీత సినిమా తో మళ్ళీ ఫెయిల్యూర్ లో కి వెళ్లిపోయారు. అయితే ఆయన స్టార్ హీరోల తో సినిమాలు చేసేది లేదు అని చెప్తూ మళ్ళీ మీడియా లో హైలైట్ అయ్యారు.

స్టార్ హీరోల తో సినిమా చేయాలంటే చాలా కష్టాలు ఉంటాయి అని చెబుతున్నారు తేజ. “స్టార్ హీరోల తో సినిమా చేస్తుంటే వాళ్ళ మీద చాలా అంచనాలు ఉంటాయి. ఆరు పాటలు, అయిదు పోరాటాలు, కామెడీ సీన్లు తప్పకుండా పెట్టాల్సి వస్తుంది. అవి లేకపోతే అభిమానులు ఒప్పుకోరు” అని చెప్పిన తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమా లో ని క్లైమాక్స్ గురించి చెప్తూ అదే సీన్ ఒక స్టార్ హీరో చేసి ఉంటే వర్క్ అవుట్ అయ్యేది కాదు అని చెప్పారు.

First Published:  8 Jun 2019 9:45 PM GMT
Next Story