చాణక్యగా మారిన గోపీచంద్

దాదాపు 2 నెలలుగా తిరు దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఓ 20 రోజుల పాటు షూటింగ్ కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడా సినిమాకు పేరు పెట్టారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చాణక్య అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

సినిమాలో గోపీచంద్ పేరు చాణక్య. అతడికి ఆ పేరు ఎందుకు పెట్టారనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమా చూసి తెలుసుకోవాలంట. సినిమాలో పెద్ద ట్విస్ట్ కూడా అదేనంట. అందుకే సినిమాకు అదే పేరును ఫిక్స్ చేశారట.

నిజానికి ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ వెదికారు. కానీ ఏ ఒక్కటి సెట్ కాలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో చాణక్య అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ముందు నుంచి ఇదే టైటిల్ కు ఫిక్స్ అయ్యామని చెబుతున్న యూనిట్.. ఇతర టైటిల్స్ కోసం ఎందుకు వెదికారో, ఇన్నాళ్లు ఎందుకు టైమ్ తీసుకున్నారో వాళ్లకే తెలియాలి.

గోపీచంద్ కెరీర్ లో ఇది 26వ సినిమా. ఈపాటికి షూటింగ్ కంప్లీట్ అవ్వాలి. కానీ ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు గోపీచంద్ కు యాక్సిడెంట్ అవ్వడం వల్ల సినిమా 50శాతం మాత్రమే పూర్తయింది. త్వరలోనే మిగతా టాకీ పూర్తిచేస్తారు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జరైన్ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.