Telugu Global
NEWS

ప్రపంచకప్ లీగ్ లో సూపర్ సండే ఫైట్

ఇటు ఆస్ట్రేలియా…అటు భారత్ కీలక విజయానికి రెండుజట్లూ తహతహ లండన్ వేదికగా నేడే దిగ్గజాల సమరం ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో అతిపెద్ద సమరానికి లండన్ లోని ఓవల్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ప్రపంచ 5వ ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు రెండో ర్యాంకర్ భారత్ సవాలు విసురుతోంది. పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ తొలిరౌండ్లో సౌతాఫ్రికాను 6 వికెట్లతో చిత్తు చేసిన భారత్…రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కంగారూల పని పట్టడానికి సిద్ధమయ్యింది. వైస్ కెప్టెన్ రోహిత్ […]

ప్రపంచకప్ లీగ్ లో సూపర్ సండే ఫైట్
X
  • ఇటు ఆస్ట్రేలియా…అటు భారత్
  • కీలక విజయానికి రెండుజట్లూ తహతహ
  • లండన్ వేదికగా నేడే దిగ్గజాల సమరం

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో అతిపెద్ద సమరానికి లండన్ లోని ఓవల్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ప్రపంచ 5వ ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు రెండో ర్యాంకర్ భారత్ సవాలు విసురుతోంది.

పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ తొలిరౌండ్లో సౌతాఫ్రికాను 6 వికెట్లతో చిత్తు చేసిన భారత్…రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కంగారూల పని పట్టడానికి సిద్ధమయ్యింది.

వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెప్టెన్ కొహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీ,యంగ్ గన్ రాహుల్, హార్థిక్ పాండ్యా సూపర్ ఫామ్ లో ఉండటంతో.. భారత టాపార్డర్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు బౌలింగ్ లో సైతం భారత్ అత్యంత ప్రమాదకరమైన జట్టుగా కనిపిస్తోంది. పేసర్లు బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, స్పిన్ జోడీ యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ఆల్ రౌండర్లు కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యాలతో భారత్ అత్యంత సమతూకంతో ఉంది.

కంగారూలకు వార్నర్, స్మిత్ పవర్…

మరోవైపు…ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా…డాషింగ్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో…టైటిల్ నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది.

మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అందుబాటులోకి రావడంతో ఆస్ట్రేలియాజట్టు బలంగా తయారయ్యింది.
ప్రారంభమ్యాచ్ లో అప్ఘనిస్తాన్ ను, రెండో రౌండ్ లో విండీస్ ను అధిగమించిన కంగారూటీమ్..వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ విజయాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది.

స్టార్క్, జంపా ఇద్దరూ ఇద్దరే…

ఇక… బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా తురుపు ముక్కలుగా మిషెల్ స్టార్క్, లెగ్ స్పిన్నర్ ఆడం జంపా కనిపిస్తున్నారు. పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ నుంచి అతిపెద్ద సవాల్ ఎదుర్కొనబోతున్నారు.

స్వదేశంలో ఆస్ట్రేలియాజట్టు చేతిలో ఎదురైన ఓటమికి ప్రస్తుత ప్రపంచకప్ లో భారత్ ఆ మ్యాచ్ ద్వారా బదులుతీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది.

సూపర్ సండే ఫైట్ గా జరుగుతున్న ఈ పోటీలో ఏజట్టు విజేతగా నిలిచినా…మ్యాచ్ రసపట్టుగా సాగడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

First Published:  8 Jun 2019 8:25 PM GMT
Next Story