తెలుగులో ఒక్కటే…. తమిళ్ లో మాత్రం మూడు….

ప్రస్తుతం ఫ్లాపులతో సతమతమవుతున్న స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ చేతిలో  ‘రణరంగం’ అనే ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది. ఈ సినిమాలో శర్వానంద్ తో రొమాన్స్ చేయబోతుంది.

మరోవైపు తమిళ్ లో కాజల్ అగర్వాల్… హిందీలో సూపర్ హిట్ అయిన ‘క్వీన్’ సినిమా తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ లో మరియు ‘కోమలి’ అనే మరొక సినిమా లో నటిస్తోంది. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ మరో తమిళ సినిమా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.

ఈసారి కాజల్ అగర్వాల్ కోలీవుడ్ స్టార్ హీరో శింబు తో నటించబోతోంది. వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి ‘మానడు’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ‘చిత్రలహరి’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో రెండో హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ ని తీసుకుందామన్న ఆలోచనతో ముందు నయనతార పేరు అనుకున్నారట. కానీ నయనతార శింబు తో సినిమా చేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించలేదని చెబుతున్నారు. అందుకే వారు కాజల్ అగర్వాల్ ని సంప్రదించారని…. ఆమె వెంటనే ఒప్పుకుందని తెలుస్తోంది.