Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు..... ట్రైన్ లో ప్రేమ కథట !

ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాతో మరో హిట్ ను అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా పై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాలో నటించబోతున్నాడు. దిల్ రాజు మరియు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించబోతోంది. తాజాగా ఈ చిత్రం లో మహేష్ బాబు […]

మహేష్ బాబు..... ట్రైన్ లో ప్రేమ కథట !
X

ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాతో మరో హిట్ ను అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా పై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాలో నటించబోతున్నాడు.

దిల్ రాజు మరియు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించబోతోంది.

తాజాగా ఈ చిత్రం లో మహేష్ బాబు మరియు రష్మిక పాత్రల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర…. ఆంధ్ర నుండి కాశ్మీర్ ప్రయాణిస్తుండగా రష్మిక మందన్న ను చూసి ప్రేమలో పడతారట. ఇప్పటిదాకా సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు చేసిన మహేష్ బాబు ని ఇప్పుడు లవర్ బాయ్ పాత్రలో చూడొచ్చని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు యూరోప్ లో హాలిడే లో ఉన్నారు. యూరప్ నుంచి తిరిగి వచ్చాక మహేష్ బాబు ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇక మహేష్ బాబు ఈ సినిమాతో తన విన్నింగ్ స్ట్రీక్ ను కొనసాగిస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

First Published:  8 Jun 2019 11:52 PM GMT
Next Story