Telugu Global
Cinema & Entertainment

నితిన్ తో కాదు.... లైన్ లోకి శ్రియా వచ్చింది....

క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఆఖరిగా మనమంతా సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్న ఈ దర్శకుడు…. మళ్ళీ ఇప్పుడు మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టు తో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించబోతున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం చంద్రశేఖర్ ఏలేటి…. నితిన్ సినిమాని కొన్నాళ్ళు హోల్డ్ లో పెట్టి ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా […]

నితిన్ తో కాదు.... లైన్ లోకి శ్రియా వచ్చింది....
X

క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఆఖరిగా మనమంతా సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్న ఈ దర్శకుడు…. మళ్ళీ ఇప్పుడు మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టు తో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించబోతున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.

అయితే తాజా సమాచారం ప్రకారం చంద్రశేఖర్ ఏలేటి…. నితిన్ సినిమాని కొన్నాళ్ళు హోల్డ్ లో పెట్టి ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయాలని ఆలోచిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోందని తెలుస్తోంది.

ఈ సినిమా థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని సమాచారం. సీనియర్ బ్యూటీ శ్రియా శరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 10 ఏళ్ల అమ్మాయికి తల్లిగా నటించబోతోందట. సినిమా కథ నచ్చడంతో శ్రియ శరన్ వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత చంద్రశేఖర్ ఏలేటి నితిన్ సినిమా పై దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First Published:  9 Jun 2019 12:30 AM GMT
Next Story