వాల్మీకి వచ్చే ముహూర్తం కుదిరింది

చాన్నాళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన హరీష్ శంకర్, ప్రస్తుతం వాల్మీకి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 6న వాల్మీకిని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాను హరీష్, వాల్మీకి పేరిట రీమేక్ చేస్తున్నాడు. తమిళ వెర్షన్ తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశాడు. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం పూజా హెగ్డేను తీసుకున్నాడు.

ఒరిజినల్ వెర్షన్ లో బాబి సిమ్హా పోషించిన పాత్రను వరుణ్ తేజ్ పోషిస్తున్నాడు. పక్కా మాస్ క్యారెక్టర్ ఇది. ఇక సిద్దార్థ్ పోషించిన పాత్రలో అధర్వ నటిస్తున్నాడు. ఇది కూడా పక్కా క్లాస్ పాత్ర. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.