Telugu Global
NEWS

ఆయన హయాంలో లాభాలు.... ఈయన హయాంలో నష్టాలే నష్టాలు

ఏపీఎస్ ఆర్టీసీ. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్ధ. దీనికి మరోపేరే అప్పుల కుప్ప. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీఎస్ ఆర్టీసీని అప్పులు వెంటాడుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయడంలో సఫలీకృతం అయ్యింది. ఆ భారం అంతా ఇప్పుడు నూతనంగా అధికారంలోకి వచ్చిన వైఎస్. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై పడింది. స్వతంత్ర కార్పొరేషన్ గా కొనసాగిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ రవాణ శాఖ నూతన మంత్రి పేర్ని నాని ప్రకటించారు. […]

ఆయన హయాంలో లాభాలు.... ఈయన హయాంలో నష్టాలే నష్టాలు
X

ఏపీఎస్ ఆర్టీసీ. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్ధ. దీనికి మరోపేరే అప్పుల కుప్ప. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీఎస్ ఆర్టీసీని అప్పులు వెంటాడుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయడంలో సఫలీకృతం అయ్యింది. ఆ భారం అంతా ఇప్పుడు నూతనంగా అధికారంలోకి వచ్చిన వైఎస్. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై పడింది.

స్వతంత్ర కార్పొరేషన్ గా కొనసాగిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ రవాణ శాఖ నూతన మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇది ప్రకటన వరకూ బాగున్నా ఆచరణలో మాత్రం ఎంత వరకూ సాధ్యమనేదే పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఖజానాను ఖాళీ చేసింది. ఉద్యోగుల జీతాలకే సతమతమయ్యె పరిస్థితికి వచ్చింది.

ఇప్పటికే సంస్దపై 6,300 కోట్ల రుణభారం ఉంది. దీనికి తోడు చంద్రబాబు నాయుడు రాజకీయ కార్యక్రమాలకు జనాలను తరలించడానికి ఆర్టీసీని అడ్డదిడ్డంగా వాడేశాడు. దీంతో భారం మరింత పెరిగింది. గడచిన 5 సంత్పరాలుగా పెట్రోలు, డీజీల్ ధరలు పెరిగాయి. డీజీల్ ధరపై సేల్స్ టాక్స్ తో పాటు, సర్ చార్జీ కూడా అదనపు భారం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ చార్జీలు పెంచాడు. అయితే అస్తవ్యస్త విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు బస్సులతో పోటీని తట్టుకుని ఆర్టీసీ నిలబడడం కష్టం.

ఇన్ని అడ్డంకులున్న రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన వైఎస్. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకుని ఎంత వరకూ మనుగడ సాధిస్తుందో వేచి చూడాల్సిందే. ఆర్టీసీ విలీనం అంశంపైనా, సమ్మె నోటీసు పైన చర్చించేందుకు సోమవారం నాడు కార్మిక సంఘాల నాయకులతో, యాజమాన్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చర్చలు జరపనున్నారు.

అయితే వైసీపీ నాయకుల అభిప్రాయం ప్రకారం…. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళ పాలనలో అనేకసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచినా ఆర్టీసీ నష్టాల్లోనే కూరుకుపోయిందని…. కానీ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి రాగానే ఐదేళ్ళ పాటు ఆర్టీసీ చార్జీలు ఒక్క పైసా కూడా పెంచకుండా లాభాల బాటలోకి నడిపించాడని…. అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీని చార్జీలు పెంచకుండానే లాభాల్లోకి తెచ్చాడని…. ఆ తరువాత వచ్చిన వారు ముఖ్యంగా చంద్రబాబు ఒక పథకం ప్రకారం ఆర్టీసీని అప్పుల్లో ముంచేశాడని…. ఆయన నలభై ఏళ్ళ అనుభవం ప్రభుత్వ సంస్థలను ఇలా దివాలా తీయించి ప్రైవేట్‌ వాళ్ళను ప్రోత్సహించడానికి పనికివస్తుందని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆర్టీసీ మళ్ళీ లాభదాయక సంస్థగా మారుతుందని, ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ ఇబ్బందేమీ లేదని వైసీపీ నాయకులు అంటున్నారు.

First Published:  10 Jun 2019 2:05 AM GMT
Next Story